ఈ పాలు జుట్టుకు వాడితే ఎన్నో లాభాలు

జుట్టు బాగు కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కనిపించిన ప్రతిదానిని ట్రై చేసేస్తూ ఉంటాం. ఆ షాంపూ అని ఈ షాంపూ అని రకరకాలవి వాడేస్తుంటాం. మార్కెట్లో దొరికే రకరకాల వాటిని ప్రయోగిస్తూ ఉంటాం. దానివల్ల జుట్టు బాగవ్వడం కంటే..ఉన్నది పోయే ప్రమాదం కూడా ఉంది. అసలే కాలుష్యం. అందులో రెండురోజులకొకసారి

ఈ పాలు జుట్టుకు వాడితే ఎన్నో లాభాలు


జుట్టు బాగు కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కనిపించిన ప్రతిదానిని ట్రై చేసేస్తూ ఉంటాం. ఆ షాంపూ అని ఈ షాంపూ అని రకరకాలవి వాడేస్తుంటాం. మార్కెట్లో దొరికే రకరకాల వాటిని ప్రయోగిస్తూ ఉంటాం. దానివల్ల జుట్టు బాగవ్వడం కంటే....ఉన్నది పోయే ప్రమాదం కూడా ఉంది. అసలే కాలుష్యం. అందులో రెండురోజులకొకసారి తలంటూ స్నానం చేసినా....జుట్టు పొడిబారిపోతుంది. అలా అని రోజూ తలస్నానం చేస్తే.....తలనొప్పి, జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

Top Hair Care Tips Straight From The Experts – SkinKraft

 ఇంక ఉండనే ఉందిగా చుండ్రు సమస్య. ఎన్ని ప్రయోగాలు చేసినా అది మాత్రం అంటుకున్న జిడ్డులా వదిలిపోదు. కాబట్టి జుట్టు బాగుండాలంటే రసాయనాలు ఉండే షాంపూలు, నూనెలు కాకుండా నేచురల్‌గా ఉండేవి వాడితే బెటర్.

అన్నింటిలో శ్రేష్టమైనది కొబ్బరినూనె, ఇది అందరికి తెలిసిందే. ఇంకా దానికంటే మించినది ఆల్మండ్‌ ఆయిల్. ప్రతిరోజూ మాడుకు, వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు మెరిసిపోతుంది. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. అందుచేత రోజూ బాదం నూనెను ఉపయోగించడం ద్వారా  జుట్టు సమస్యలను దూరం చేసుకోవచ్చు. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే కొబ్బరినూనె కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టును వత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. బాదం నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా స్కాల్ప్ ఇరిటేషన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

7 Homemade Hair Pack For Dry Hair | Be Beautiful India


ఇంకా జుట్టు సంరక్షణలో ఆలివ్ ఆయిల్ మెరుగ్గా పనిచేస్తుంది. మాడుకు తేమనిస్తుంది. చుండ్రును దూరం చేస్తుంది. ఒత్తైన నల్లని జుట్టు పొందాలంటే.. ఆవనూనె ఉపయోగించవచ్చు. ఈ ఆయిల్ తలలో రక్తప్రసరణను పెంచి జుట్టు పెరగడానికి సహాయం చేస్తుంది. జుట్టు సంరక్షణకు నువ్వులనూనెను ఉపయోగించడం ఎంతో మేలు చేస్తుంది. వారానికోరోజు నువ్వులనూనెతో తలకు మసాజ్ చేస్తే జుట్టు పెరుగుతుంది.

కొబ్బరి పాలను జుట్టుకు పట్టిస్తే కుదుళ్లు బలంగా తయారు అవుతాయి. కాంతివంతంగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. కొబ్బరి పాలను జుట్టుకు  పట్టించేముందు..తలలో నూనె లేకుండా చూసుకోవాలి. ఈ కొబ్బరి పాలను రాత్రి పడుకునే ముందు కుదుళ్లకు పట్టించాలి. రాత్రంతా అలానే ఉంచాలి. ఏం కాదు. ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.