మొటిమలా? చింతించకండి..ఇలా ట్రై చేయండి

మొటిమలకు అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలుష్యం, మనం తినే ఆహారం అన్నీ....మన శరీరంపై ప్రభావం చూపుతాయి. అందులోనూ ఎండాకాలం. సూర్యుడు డైరక్ట్‌గా మనమీదే పడుతున్నాడేమో అనిపిస్తుంది. సూర్యరశ్మి వల్ల మరిన్ని మొటిమలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

మొటిమలా? చింతించకండి..ఇలా ట్రై చేయండి


మొటిమలకు అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలుష్యం, మనం తినే ఆహారం అన్నీ....మన శరీరంపై ప్రభావం చూపుతాయి. అందులోనూ ఎండాకాలం. సూర్యుడు డైరక్ట్‌గా మనమీదే పడుతున్నాడేమో అనిపిస్తుంది. సూర్యరశ్మి వల్ల మరిన్ని మొటిమలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Acne Face Map: The Cause of These Breakouts – Cleveland Clinic

అయితే టీనేజ్‌ కన్నా ముందు మొటిమలు వచ్చే అవకాశం తక్కువ. కానీ టీనేజ్‌లోకి అడుగుపెట్టగానే మొటిమలు, మచ్చలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్ మార్చేస్తూ ఉంటారు. అయితే అంతగా ఫలితాలు ఉండకపోవచ్చు. మొటిమలనేవి సాధారణ సమస్యే. జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ముఖం పాడయ్యే ప్రమాదం ఉంది.

దీనికోసం ఇంట్లోనే పరిష్కారం దొరుకుతుంది. సహజసిద్ధంగా ఔషధాన్ని తయారుచేసుకోవచ్చు. అదేనండీ.....మనకు దొరికే ఫ్రూట్స్‌తో మాస్కులు వేసుకుని మొటిమలను దూరం చేయోచ్చు. దానికి తోడు పోషకాహారం తిన్నా మొటిమలు, మచ్చలు దగ్గరకు రాకుండా చేయోచ్చు

ఆ ఫ్రూట్‌ మాస్కులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

ముల్తానీ మట్టిలో జీలకర్ర పొడి, దాల్చినచెక్క పొడి, లవంగం పొడి చిటికెడు చొప్పున వేసి తగినంత రోజ్‌వాటర్‌లో కలిపి....ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాసుకోవాలి. అలా పావుగంట ఉంచి ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. అంతేకాకుండా కాటన్‌ వస్త్రంతో తుడుచుకోవాలి. గట్టిగా రుద్దేసుకుండా నెమ్మదిగా ఒత్తుతూ తుడుచుకోవాలి. ముల్తానీ మట్టి ప్యాక్‌ను....వారానికి ౩ సార్లు రాసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే 2నెలల్లో ఫలితం కచ్చితంగా కనిపిస్తుంది. మొటిమలు తగ్గుతాయి.

స్నానం చేసేప్పుడు రోజూ సబ్బు వాడటం కంటే సున్నిపిండి వాడటం చాలా ఉత్తమం. ఎందుకంటే దాంట్లో ఎలాంటి రసాయనాలు ఉండవు, ముఖాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది.

దానిమ్మ గుజ్జు, నిమ్మరసాన్ని కలిపి స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. అరటి పండు గుజ్జులో....... చిటికెడు పసుపు, అర టీస్పూన్ శనగపిండిని కలిపిన మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు చాలా వరకూ దూరం అవుతాయి.

బొప్పాయి గుజ్జులో శెనగపిండి కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. అనంతరం కాసిన్ని నీటిని స్ప్రే చేసి చేతులతో మసాజ్ చేస్తూ క్లీన్ చేయాలి. ఇలా రెండు నిమిషాలు చేసిన అనంతరం చల్లని నీటితో మొత్తం క్లీన్ చేయాలి.

అంతేకాకుండా కోల్‌గేట్‌ టూత్ పేస్ట్ ని రాత్రి పడుకునే ముందు మొటిమలు ఉన్నచోట పెట్టాలి. ఉదయం లేవగానే చల్లటి నీటితో కడగాలి. పెట్టిన వెంటనే ఉపశమనం పొందటమే కాకుండా మొటిమలు కూడా తొలగిపోతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.