Hair Care : చుండ్రు సమస్యను శాశ్వతంగా నయం చేసే చిట్కాలు..!

Hair Care : చుండ్రు సమస్య ఈరోజుల్లో కామన్‌గా అందరికీ ఉంటుంది.. చుండ్రు ఎక్కువైతే.. ఉన్నజుట్టు కూడా ఊసిపోతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇప్పటికే చాలా షాంపూలు వాడుతున్నారు. అయినా మీకు పెద్దగా లాభం లేదా..?

Hair Care : చుండ్రు సమస్యను శాశ్వతంగా నయం చేసే చిట్కాలు..!


Hair Care : చుండ్రు సమస్య ఈరోజుల్లో కామన్‌గా అందరికీ ఉంటుంది.. చుండ్రు ఎక్కువైతే.. ఉన్నజుట్టు కూడా ఊసిపోతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇప్పటికే చాలా షాంపూలు వాడుతున్నారు. అయినా మీకు పెద్దగా లాభం లేదా..? అధిక ఒత్తిడికి గురైనా కూడా చుండ్రు స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఎక్కువ స‌మ‌యం ఏసీ గ‌దుల్లో గ‌డుపటం వల్ల కూడా చుండ్రు సమస్య వస్తుంది.. త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు త‌ల‌కు అంటుకున్న షాంపూ పూర్తిగా వ‌ద‌ల‌క‌పోయినా కూడా చుండ్రు స‌మ‌స్య వ‌స్తుంది. కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య‌ను ఇట్టే న‌యం చేసుకోవ‌చ్చు. త‌ల‌లో వ‌చ్చే చుండ్రు స‌మ‌స్య‌ను నివారించే గుణం బిర్యానీ ఆకుకు ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

బిర్యానీ ఆకు మీద జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. సుగంధ ద్ర‌వ్యాల్లో ఒక‌టైన బిర్యానీ ఆకును ఉప‌యోగించి చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు.. ముందుగా బిర్యానీ ఆకును ముక్క‌లుగా చేసి నీటిలో నాన‌బెట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక బిర్యానీ ఆకుల‌ను వేడి చేయాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని త‌ల‌కు రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త‌గ్గు ముఖం పడుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.
బిర్యానీ ఆకును నీటిలో నాన‌బెట్టి పేస్ట్‌గా చేసి త‌ల‌కు ప‌ట్టించిన కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఇలా బిర్యానీ ఆకుల‌ను పేస్ట్‌గా చేసి వాడితే.. చుండ్రు స‌మ‌స్య‌తో పాటు జుట్టు రాల‌డం కూడా తగ్గుతుంది. త‌ల‌పై జుట్టు లేని ప్రాంతంలో ఈ పేస్ట్‌ను రాయ‌డం వ‌ల్ల దీనిలో ఉండే నూనెలు జుట్టులోకి వెళ్లి తిరిగి జుట్టును బాగా పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.
 
త‌ల‌స్నానం చేయ‌డానికి అర‌గంట ముందు పుల్ల‌టి పెరుగులో నిమ్మ‌ర‌సం క‌లిపి త‌ల‌కు ప‌ట్టించాలి. వారానికి ఒక‌సారి ఇలా చేయ‌డం వల్ల త‌ల‌లో చుండ్రు రాకుండా ఉంటుంది. అలాగే నిమ్మ‌ర‌సంలో ఉసిరికాయ ర‌సాన్ని కానీ ఉసిరికాయ పొడిని కానీ క‌లిపి త‌ల‌కు రాసి మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేసిన ఒక గంట త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల కూడా చుండ్రు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.
మెంతుల‌ను నాన‌బెట్టి పేస్ట్‌గా చేసి త‌ల‌కు రాయాలి. అర‌గంట త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా బిర్యానీ ఆకును లేదా ఈ చిట్కాల‌ను ఉప‌యోగించి ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చుండ్రు స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా నివారించుకోవచ్చు
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.