Hair fall : జుట్టు రాలిపోతుందా..? కారణాలు తెలుసుకోండి ఫస్ట్..!!

Hair fall  అనేది ఈరోజుల్లో ప్రతి ఇంట్లో ఉన్న సమస్యే.. దీనికి కారణాలు అంటూ స్పెషల్‌గా ఏం ఉండవు. రోజుకు కొంత hair fall  అంటే సాధారణమే. కానీ అధికంగా జుట్టు అదేపనిగా రాలిపోతుందంటే ఆలోచించాల్సిన విషయమే.. కొన్ని అనారోగ్య

Hair fall : జుట్టు రాలిపోతుందా..? కారణాలు తెలుసుకోండి ఫస్ట్..!!
The reasons for hair fall


Reasons for hair fall : Hair fall  అనేది ఈరోజుల్లో ప్రతి ఇంట్లో ఉన్న సమస్యే.. దీనికి కారణాలు అంటూ స్పెషల్‌గా ఏం ఉండవు. రోజుకు కొంత hair fall  అంటే సాధారణమే. కానీ అధికంగా జుట్టు అదేపనిగా రాలిపోతుందంటే ఆలోచించాల్సిన విషయమే.. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఏ సమస్యల వల్ల జుట్టు రాలిపోతుందో ఇప్పుడు చూద్దామా..! దీని వల్ల మనకు ఉన్న సమస్య ఏంటో తెలుస్తుంది.. 
హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం.. ఈ రెండింటిలో ఏ స‌మ‌స్య ఉన్నా స‌రే జుట్టు రాలిపోతుంది. థైరాయిడ్ హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ఈ స‌మ‌స్య వ‌స్తుంది.

గ‌ర్భం ధరించిన స్త్రీల‌కు స‌హ‌జంగానే జుట్టు రాలిపోతుంది. అయితే వారు ప్ర‌స‌వించాక ఈ స‌మ‌స్య ఉండదు...డిప్రెష‌న్, విటమిన్ ఏ, క్యాన్సర్ మందుల‌ను వాడినా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంటుంది. వంశ పారంప‌ర్యంగా కూడా జుట్టు రాలిపోయే స‌మ‌స్య వ‌స్తుంది. ఇంట్లో పెద్ద‌ల‌కు ఎవ‌రికైనా బ‌ట్ట‌త‌ల ఉంటే వారి పిల్ల‌ల‌కు జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది.
ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌గా ఉన్న‌వారికి కూడా జుట్టు రాలిపోతుంది. 75 శాతం మందికి జుట్టు రాలిపోయే స‌మ‌స్య ఈ కార‌ణం వ‌ల్లే వ‌స్తుంది. క‌నుక ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తే జుట్టు రాలిపోయే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
ప‌లు ర‌కాల పోష‌క ప‌దార్థాల లోపం ఉన్నా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది. శిరోజాల‌కు స్ట‌యిల్ త‌ర‌చూ చేయించ‌డం, ర‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడ‌డం, కాలుష్యం, హెయిర్ డ్ర‌య్య‌ర్‌ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారిలోనూ జుట్టు రాలుతుంది. అలాగే జుట్టు త‌డిగా ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా రాలుతుంది. క‌నుక త‌ల‌స్నానం చేయ‌గానే వెంట‌నే జుట్టును ఆర‌బెట్టుకోవాలి. త‌డి జుట్టు మీద దువ్వ‌కూడ‌దు. బాగా చ‌ల్ల‌గా, బాగా వేడిగా ఉండే నీటితో త‌ల‌స్నానం చేయ‌రాదు. గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి. లేదంటే జుట్టు బాగా రాలిపోతుంది.
జుట్టు రాలొద్దు ఆరోగ్యంగా ఉండాలి అని అందరూ అనుకుంటారు..కానీ దాని కోసం ఏం చేయాలో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఫాలో అవుతారు. సరైన జీవనశైలి పాటిస్తూ.. జుట్టుకు ఎక్కువగా రసాయానాలు వాడకుండా ఉంటే..జుట్టు సమస్యలు ఉండవు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.