పెరుగు వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా మెరుగుపడుతుంది. చాలా మంది బ్యూటీ టిప్స్‌లో పెరుగును వాడుతుంటారు. పెరుగును ఉపయోగించడం వల్ల ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం పొడిబారకుండా తాజాగా ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే పెరుగును ఉపయోగించడం వల్ల దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పెరుగుతో మీ ముఖం మెరిసిపోయో అందమైన చిట్కా గురించి ఈరోజు చూద్దామా..!

ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ గోధుమపిండిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చేత్తో కానీ, బ్రష్ తో కానీ ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరే వరకు ముఖాన్ని కదిలించకుండా అలాగే ఉంచాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఎండ వల్ల ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ తొలగిపోతుంది. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి ముఖం అందంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఈ చిట్కాను తరచూ వాడడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. గోధమపిండి చర్మానికి బాగా ఉపయోగపడుతుంది.
పెరుగును ఉపయోగించడం వల్ల దెబ్బతిన్న చర్మ కణాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తెల్లగా మారుతుంది. పెరుగులో కాఫీ పౌడర్, రోజ్ వాటర్, కాస్త టమోటా గుజ్జు, నిమ్మరసం రెండు చుక్కలు, గోధుమ పిండి రెండు స్పూన్లు ఇవన్నీ వేసి బాగా కలిపి కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి ముఖానికి, మెడలకు, మోచేతులుక రాసుకుని ఆరిన తర్వాత మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. ఫేస్ ప్యాక్ వేసిన రోజు కంటే. తెల్లారి ముఖంలో రిజల్ట్ ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి ఓపిగ్గా చేసి చూడండి.. ఇక మీరు పార్లర్‌లో డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు.