ఆస్ప్రిన్ ట్యాబ్లెట్‌ను ముఖానికి ఇలా వాడితే అమేజింగ్‌ రిజల్ట్..! 

చ‌ర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచే ఫేస్ ఫ్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఎప్పుడు ఒకవిధంగా అంటే.ఈ ఫేస్ ఫ్యాక్‌ను త‌యారు చేసుకోవ‌డానికి గాను మ‌నం Aspirin tablet ఉప‌యోగించాలి.

ఆస్ప్రిన్ ట్యాబ్లెట్‌ను ముఖానికి ఇలా వాడితే అమేజింగ్‌ రిజల్ట్..! 
Benefits of Aspirin tablet in skin care


ఇంట్లోనే ఉన్నా.. కొన్నిసార్లు ముఖం పాడవుతుంది. నల్లగా అయిపోవడం, డ్రై అయిపోయినట్లు కనిపిస్తుంది. నిగారింపు ఉండదు. మ‌న ముఖాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే. అయితే కొన్ని ర‌కాల ఫేస్ ఫ్యాక్‌ల‌ను వాడితే మాత్రం మ‌న చ‌ర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవ‌డం ఏమంత క‌ష్టం కాదు అంటున్నారు సౌందర్య నిపుణలు. చ‌ర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచే ఫేస్ ఫ్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఎప్పుడు ఒకవిధంగా అంటే.. ఎప్పుడూ నల్లగా, మచ్చలతో కాదు.. అందంగా అండీ..!

ఈ ఫేస్ ఫ్యాక్‌ను త‌యారు చేసుకోవ‌డానికి గాను మ‌నం Aspirin tablet ఉప‌యోగించాలి.. ఆస్ప్రిన్ టాబెట్ల‌ను ఫేస్ ఫ్యాక్‌లో వాడటమేంట్రా అనుకుంటున్నారా.. దీనిని జ్వరం, నొప్పులు, రుమాటిక్ ఫీవ‌ర్, కీళ్ల వాపు వంటి వ్యాధుల చికిత్స‌లో ఉప‌యోగిస్తారు. ఈ టాబ్లెట్‌తో ముఖ సౌంద‌ర్యం కూడా పెంచుకోవ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు. జ్వ‌రాన్ని, నొప్పుల‌ను నివారించ‌డంలోనే కాకుండా చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఈ ట్యాబ్లెట్‌ బాగా పనిచేస్తుంది.

ఆస్ప్రిన్ టాబ్లెట్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు,మ‌చ్చ‌లుకూడా తొల‌గించుకోవ‌చ్చు. 
సూర్య‌ర‌శ్మి వ‌ల్ల క‌లిగే చ‌ర్మ సంబంధిత మ‌చ్చ‌లు తొల‌గిపోయి ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది. 
క‌ళ్ల చుట్టూ ఉండే న‌ల్ల‌ని వ‌ల‌యాలు తొల‌గిపోతాయి. 
ఆస్ప్రిన్ టాబ్లెట్ల‌తో వేసిన మాస్క్ చాలా శక్తివంతంగా, వేగంగా ప‌ని చేస్తుంది. అయితే దీనిని ఒక్కో చ‌ర్మత‌త్వం ఉన్న వారు ఒక్కో విధంగా ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా జిడ్డు చ‌ర్మం ఉన్న వారు ఎలా వాడాలో చూద్దామా.!

ఆస్ప్రిన్ టాబ్లెట్‌ను ముందుగా పొడిగా చేయాలి. త‌రువాత దీనికి త‌గినంత నీళ్ల‌ను, టీ ట్రీ ఆయిల్‌ను క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని రాసుకునేట‌ప్పుడు కంటికి త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. ముఖానికి రాసుకున్న ఈ మిశ్ర‌మాన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత నీటితో క‌డిగేయాలి. పొడి చ‌ర్మం ఉన్న వారు దీనిలో టీ ట్రీ ఆయిల్‌కు బ‌దులుగా బాదం నూనెను క‌లిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల త‌రువాత క‌డిగేయాలి. ఈ విధంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

సూర్య‌ర‌శ్మి వ‌ల్ల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చిన వారు ఈ టాబ్లెట్ ల‌ను మ‌రో విధంగా ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఆస్ప్రిన్ టాబ్లెట్‌ల‌ను పొడిగా చేసి దానిలో పెరుగు, నిమ్మ ర‌సాన్ని క‌లిపి ముఖానికి రాసుకోవాలి. దీనిని కూడా 20 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా త‌ర‌చూ ఆస్ప్రిన్ టాబ్లెట్ ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఆయా చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గి ముఖం కాంతివంతంగా, అందంగా త‌యార‌వుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.