తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కా..!

తెల్లజుట్టు, అధిక బరువు ఈరోజుల్లో చాలామందికి ఉంటున్న సమస్యలు.. చిన్నవయసులోనే వెంట్రుకలు తెల్లగా అయితే అస్సలు ఎంత బాధ ఉంటుందో.. ముఖ్యంగా అమ్మాయిలకు..అసలే అందంగా ఉండాలని తాపత్రయ పడతారు. తెల్లజుట్టుకు రంగు వేయడం స్టాట్‌ చేశారంటే..ఇక మీరు వారం వారం వేస్తూనే ఉండాలి. దానివల్ల ఉన్న జుట్టు కూడా తెల్లగా అవుతుంది. ఊడిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం..తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు బోలెడు మార్గాలు ఉన్నాయి. అలాంటి ఓ సహజసిద్ధమైన చిట్కానే ఇది..! బిళ్ల గ‌న్నేరు మొక్క‌ గురించి మీరు వినే ఉంటారు. ఇవి పింక్ లేదా తెలుపు రంగులో పూల‌ను పూస్తుంటాయి. అయితే పింక్ రంగులో ఉండే బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల‌ను సేక‌రించాలి. ఇవి జుట్టును న‌ల్ల‌గా మారుస్తాయి. వీటిల్లో ఉండే ప‌లు బ‌యో యాక్టివ్ స‌మ్మేళనాలు జుట్టుపై ప్ర‌భావం చూపిస్తాయి. దీంతో తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల‌ను సేక‌రించి క‌డిగి శుభ్రం చేసి వాటి నుంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని రెండు టీస్పూన్ల మోతాదులో తీసుకోవాలి. ఇక బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల ర‌సం తీశాక‌.. అందులో ఒక నిమ్మ‌కాయ ర‌సాన్ని పూర్తిగా తీసి క‌ల‌పాలి. ఆ త‌రువాత ఆ మిశ్ర‌మంలోనే ఒక టీస్పూన్ కొబ్బ‌రినూనెను క‌ల‌పండి.. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపిన త‌రువాత జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టేలా మ‌ర్ద‌నా చేయండి..5 నిమిషాల పాటు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు రాయాలి. త‌రువాత ఒక గంట పాటు అలాగే ఉండాలి. అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో క‌నీసం రెండు సార్లు చేయాలి. దీంతో తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. అలాగే ఇత‌ర జుట్టు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. బిళ్ల గ‌న్నేర మొక్క ఆకుల్లో ఉండే స‌మ్మేళ‌నాలు తెల్ల జుట్టును న‌ల్ల‌గా మారుస్తాయి. నిమ్మ‌ర‌సంలో ఉండే పోష‌కాలు చుండ్రును తొల‌గిస్తాయి. జుట్టు కుదుళ్ల‌ను శుభ్రం చేస్తాయి. కొబ్బ‌రినూనె జుట్టుకు పోష‌ణ‌ను అందిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దృఢంగా, ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. వీటి మిశ్ర‌మాన్ని వాడితే అన్ని ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌కు ఒకేసారి చెక్ పెట్ట‌వ‌చ్చు. ముఖ్యంగా తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా మీ తెల్ల జుట్టును నల్లగా మార్చేయొచ్చు.! తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కా..! బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల ర‌సం తీసి అందులో ఒక నిమ్మ‌ర‌సం, ఒక టీస్పూన్ కొబ్బ‌రినూనెను క‌ల‌పండి.. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపిన త‌రువాత జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టేలా మ‌ర్ద‌నా చేయండి..5 నిమిషాల పాటు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు రాయండి. త‌రువాత ఒక గంట పాటు అలాగే ఉండాలి. అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో క‌నీసం రెండు సార్లు చేయాలి. దీంతో తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. అలాగే ఇత‌ర జుట్టు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కా..!


గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.