నిద్రపోయేప్పుడు ఈ తప్పులు చేస్తే.. ముఖంపై మొటిమలు కాయం..!

ఈ రోజుల్లో చాలామందికి మొటిమల సమస్య కామన్‌గా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్‌ తిన్నా కొంతమందికి ఈ పింపుల్స్‌ వస్తూనే ఉంటాయి.. ఇలా జరుగుతుంది అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నట్లు..

నిద్రపోయేప్పుడు ఈ తప్పులు చేస్తే.. ముఖంపై మొటిమలు కాయం..!


ఈ రోజుల్లో చాలామందికి మొటిమల సమస్య కామన్‌గా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్‌ తిన్నా కొంతమందికి ఈ పింపుల్స్‌ వస్తూనే ఉంటాయి.. ఇలా జరుగుతుంది అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నట్లు.. లోపం ఎక్కడ ఉందో గమనించుకోవాలి. నిద్రపోతున్నప్పుడు చేసే తప్పులు కూడా మెుటిమలకు కారణం అవుతాయి. మనం నిద్రపోయే విధానం మన చర్మం యొక్క స్థితిని ప్రభావితం చేస్తుంది. మొటిమలకు కారణమవుతుంది. మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి రాత్రి ఉత్తమ సమయం. కొన్ని పొరపాట్లు మీ చర్మాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఉదయాన్నే మొటిమలను కలిగిస్తాయి.

దిండ్లను తరచుగా కడగడం, మార్చడం చాలా అవసరం. పిల్లోకేసులు మురికి, కాలుష్య కారకాలతో ఉంటాయి. సాధారణంగా దిండుపై ముఖాన్ని పెట్టుకుంటాం. ఫలితంగా పిల్లో కేస్‌లో ఉండే బ్యాక్టీరియా చర్మానికి వ్యాపించి మొటిమలను కలిగిస్తుంది. మొటిమలు రాకుండా ఉండాలంటే వారానికోసారి మీ పిల్లోకేస్‌ని మార్చుకోండి. 

మేకప్ తొలగించకుండా నిద్రపోతాం. ఇదే అసలు సమస్య.. చర్మానికి హాని కలుగుతుంది. రాత్రంతా మేకప్ అలానే ఉంటే.. రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఏర్పడతాయి. మీరు ఎంత అలసిపోయినా మేకప్‌ను శుభ్రం చేసి పడుకోవడం మాత్రం మర్చిపోకండి.

బోర్లా పడుకోవడం వలన కూడా మొటిమలు వస్తాయి. ఈ స్థితిలో నిద్రిస్తున్నప్పుడు, మీ చర్మం నేరుగా పిల్లోకేస్‌తో సంబంధం కలిగి ఉంటుంది. రాత్రంతా మీ చర్మం, పిల్లోకేస్‌కు అతుక్కొనే ఉంటుంది. ఇది కూడా మెుటిమలకు కారణం అవుతుంది. మీరు మొటిమలను నివారించాలనుకుంటే, తేమతో కూడిన వాతావరణంలో నిద్రపోకండి. బోర్లా పడుకుంటే.. ముఖంపై ముడతలు కూడా త్వరగా వస్తాయి.

రాత్రిపూట హెయిర్ ఆయిల్ పెట్టుకుని పడుకోవటం అలవాటు. తెల్లారేసరికి జుట్టుకు ఏదో అద్భుతం జరుగుతుంది అనుకుంటారు.. అయితే మీ చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రాత్రిపూట హెయిర్ ఆయిల్ రాసుకుని నిద్రపోకూడదు. రాత్రంతా నూనె ముఖం మీదకు వస్తుంది. అదనపు నూనె చర్మంపై మొటిమలను కలిగిస్తుంది.

ముఖానికి స్పెషల్‌గా టవల్‌ పెట్టుకోవాలి. అన్నింటికి కలిపి ఒకటే వాడితే..చర్మ సమస్యలు వస్తాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.