టీనేజ్ కూడా దాటలేదు.. అప్పుడే జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. మాడు పలుచగా మారిందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య జుట్టు ఊడిపోవడం. అందమైన, పొడవైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ కాలంలో ఇది కలగానే మిగిలిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు..

టీనేజ్ కూడా దాటలేదు.. అప్పుడే జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. మాడు పలుచగా మారిందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!


వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య జుట్టు ఊడిపోవడం. అందమైన, పొడవైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ కాలంలో ఇది కలగానే మిగిలిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఊడటాన్ని అరికట్టడమే కాకుండా వూడిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఊడిపోతున్న జుట్టుని ఆపటం సాధ్యమే అయితే ఎందుకు  కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి.

తీసుకోవలసిన జాగ్రత్తలు..

సాధారణంగా కనిపించే ప్రతి నూనెని, షాంపూని తలకి ఉపయోగించడం మంచి పద్ధతి కాదు. ఎలాంటి కెమికల్స్ లేని సహజ సిద్ధంగా దొరికే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను తలకి రాసుకోవడం వల్ల జుట్టు ఊడే సమస్యను అరికట్టవచ్చు.

తల స్నానం చేసినప్పుడు జుట్టుకు సరిపడే అంత షాంపును మాత్రమే ఉపయోగించాలి. అది కూడా నీటిలో కలిపి తలకి రాసుకోవడం మేలు.

కొందరిలో చుండ్రు సమస్య విపరీతంగా వేధిస్తుంది. ఎలాంటి వారు వేపా మందార మెత్తగా నూరి తలకు రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా చేశాక అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి.

దేవునికి ఉపయోగించే పారిజాత పువ్వులు చెట్టుకి గింజలు ఉంటాయి. వీటిని నీటితో నూరి తలకు పట్టించి ఒక గంట తర్వాత దువ్వెనతో దువ్వాలి. ఆ తర్వాత తలనట్టు పోసుకుంటే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది.

రాత్రిపూట పాలను కాచి అందులో అన్నము ఉల్లిపాయ వేసి తోడు పెట్టాలి. ఉదయం లేవగానే దీన్ని అల్పాహారంగా తీసుకుంటే విపరీతంగా వేధించే తలనొప్పి తగ్గటమే కాకుండా చుట్టూ ఉండే సమస్య తగ్గుతుంది.

రాత్రిపూట ఎక్కువ సమయం నిద్రపోకుండా ఉండకూడదు. ఇలా చేయడం వల్ల కచ్చితంగా జుట్టు ఊడిపోయే సమస్య ఉంటుంది. సరేనా నిద్ర లేకపోతే విపరీతంగా జుట్టు ఊడిపోతుంది.

పోషకాహారం లోపం వల్ల జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువవుతుంది ఐరన్ తక్కువ అయిన ఇదే సమస్య కనిపిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.