ఈ తప్పులు చేస్తున్నారా.? మీ అందాన్ని మీరే పాడుచేసుకుంటున్నారుగా..!

అందంగా ఉండాలంటే ఖరీదైన కాస్మోటిక్స్‌ వాడాలి, పార్లర్‌కు రెగ్యులర్‌గా వెళ్లాలి అని చాలా మంది అనుకుంటారు. మీరు ఒక మంచి డైట్‌ను అలాగే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తేచాలు.. ఏం వాడుకున్నా కూడా మీరు అందంగా ఉంటారు. ఇంట్లోనే ఉండి బోలెడు ఫేస్‌ ప్యాక్స్‌ తయారు చేసుకోవచ్చు. మన వంటిల్లో.. పెద్ద పార్లర్

ఈ తప్పులు చేస్తున్నారా.? మీ అందాన్ని మీరే పాడుచేసుకుంటున్నారుగా..!


అందంగా ఉండాలంటే ఖరీదైన కాస్మోటిక్స్‌ వాడాలి, పార్లర్‌కు రెగ్యులర్‌గా వెళ్లాలి అని చాలా మంది అనుకుంటారు. మీరు ఒక మంచి డైట్‌ను అలాగే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తేచాలు.. ఏం వాడుకున్నా కూడా మీరు అందంగా ఉంటారు. ఇంట్లోనే ఉండి బోలెడు ఫేస్‌ ప్యాక్స్‌ తయారు చేసుకోవచ్చు. మన వంటిల్లో.. పెద్ద పార్లర్. అందులో ఉండే పదార్థాలే.. ఖరీదైన కాస్మోటిక్స్‌. మీకు వాటిని వాడటం తెలిసి ఉండాలి అంతే. కొన్ని తప్పులు చేయకపోతే మీ అందం ఎప్పటికీ అలానే ఉంటుంది. చాలా మంది అందం విషయంలో చేసే కామన్‌ మిస్టేక్స్‌ ఇవే.!

మేకప్ వేసుకుని నిద్రపోవడం

రోజంతా మేకప్ వేసుకుని ఉండటం మంచి అలవాటు కాకపోవచ్చు. పడుకునే ముందు తప్పని సరిగా దాన్ని తొలగించాలి. లేదంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏర్పడతాయి. ఇది రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. అందుకే నిద్రపోయేటప్పుడు చర్మం ఊపిరి పీల్చుకోవడానికి అనువుగా ఉండేందుకు పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్‌ని తొలగించడం అలవాటు చేసుకోండి. లిప్‌స్టిక్‌ కూడా ఉండకూడదు.

మాయిశ్చరైజర్

నిద్రవేళకు ముందు మాయిశ్చరైజర్ స్కిప్ చేయడం చాలా మంది చేసే తప్పు. కానీ నిద్రపోయే ముందు చర్మానికి మాయిశ్చరైజర్ చేయడం వల్ల తేమను లాక్ చేస్తుంది. హైడ్రేటెడ్, మృదువుగా ఉండే చర్మం కోసం ఈ దశ చాలా ముఖ్యమైనది. చర్మ రకానికి సరిపోయే మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్యలో దీన్ని భాగం చేసుకోవాలి.

రాత్రిపూట జుట్టుకి నూనె రాయడం

జుట్టుకి నూనె రాసుకుని మసాజ్ చేసుకోవడం మంచిదే. కానీ రాత్రిపూట రాసుకుని అలాగే వదిలేయడం మాత్రం మంచి అలవాటు కాదు. జుట్టుకు నూనెను 30 నుంచి 45 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. హెయిల్ ఆయిల్ రాత్రంతా ఉంచితే అది చర్మంలోకి చొచ్చుకుపోతుంది. దీని వల్ల రంధ్రాలు మూసుకుపయి మొటిమలు ఏర్పడతాయి. నిద్రవేళకు కొన్ని గంటల ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసి శుభ్రంగా కడిగేయాలి.

మద్యం సేవించడం

పడుకునే ముందు ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ తో పాటు మొహం కూడా ఉబ్బిపోతుంది. నిర్జలీకరణానికి కారణమవుతుంది. నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఆల్కహాల్ పరిమితం చేయాలి.

మురికి దిండ్లు, దుప్పట్లు

మురికిగా ఉండే బెడ్ షీట్స్, దిండ్లు చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటివల్ల సరిగ్గా నిద్రపట్టకపోగా చర్మం కూడా పాడవుతుంది. మృదువుగా ఉండే నాణ్యమైన నూలుతో చేసిన షీట్లు, దిండ్లు ఎంచుకోవాలి. ఫాబ్రిక్ నుంచి మలినాలు ముఖం మీదకి చేరకుండా ఉండాలంటే వారానికి ఒకసారి దిండు కవర్లు మార్చుకోవాలి.

తగినంత నిద్రపోవడం

ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే తగినంత నిద్ర చాలా అవసరం. నిద్రలేకపోవడం వల్ల మొహం నీరసంగా, కలల కింద నల్లటి వలయాలు పెరగడం, చర్మం మంటగా అనిపిస్తుంది. నిద్రపోతున్నప్పుడు కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. మెరుగైన రక్తప్రసరణ జరగకపోతే కళ్ళ కింద క్యారీబ్యాగ్స్‌ రాత్రి కనీసం 7-9 గంటల పాటు నిద్ర చాలా అవసరం.

ఎక్కువగా ఎక్స్ ఫోలియేట్

చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. అయితే అతిగా చేస్తే ఎక్కువ హాని కలుగుతుంది. కఠినమైన స్క్రబ్ ఉపయోగించి రుద్దడం వల్ల చర్మం దెబ్బతింటుంది. మచ్చలు, పిగ్మెంటేషన్‌కి దారి తీస్తుంది. చర్మ రకానికి తగిన సున్నితమైన ఎక్స్ ఫోలియేటర్లు ఉపయోగించాలి. అధిక స్క్రబ్బింగ్ నివారించాలి. ఇది ముఖంలోని ముఖ్యమైన నూనెలను తొలగిస్తుంది. పొడి బారిపోయేలా చేస్తుంది.

సన్ స్క్రీన్ రాసుకోకపోవడం

ఎండ లేదని సన్ స్క్రీన్ రాసుకోకుండా అసలు ఉండకూడదు. హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో, సన్ బర్న్ నివారించడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సన్ స్క్రీన్ చక్కగా తోడ్పడుతుంది. చల్లగా ఉన్న వాతావరణంలో కూడా 30 లేదా అంతకంటే ఎక్కువ SPFతో సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.