కీరా' తో కోరినంత ఆరోగ్యం-అందం మీసొంతం.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!

ఈ మండే ఎండలో దాదాపుగా చాలా మంది శరీరానికి చలువనిచ్చేలా ఆహారాన్ని తీసుకుంటుంటారు. అయితే చలువనిచ్చేలా ఆహారాల్లో కీరా దోస ఒకటి. ఎన్నో పోషకాలు ఉన్న ఈ దోసకాయ వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బాడీలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు కరిగిపోతుంది.

కీరా' తో కోరినంత ఆరోగ్యం-అందం మీసొంతం.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!


ఈ మండే ఎండలో దాదాపుగా చాలా మంది శరీరానికి చలువనిచ్చేలా ఆహారాన్ని తీసుకుంటుంటారు. అయితే చలువనిచ్చేలా ఆహారాల్లో కీరా దోస ఒకటి. ఎన్నో పోషకాలు ఉన్న ఈ దోసకాయ వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బాడీలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది. అవును మీరు చదివింది నిజమే..  ఎండాకాలంలో ఎక్కువగా దొరికే ఈ కీరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఎండాకాలంలో చాలా మంది  దీన్ని నేరుగా తినడంతో పాటు సలాడ్స్‌లోనూ ఉపయోగిస్తుంటారు. మరి కీరా దోసకాయ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..

Health Tips: రాత్రిపూట ఈ పదార్థాలు తినడం మంచిదేనా.. సరైన సమయం ఏంటో తెలుసా?  - Telugu News | Cucumber Health benefits for health check here here full  details right time to eat cucumber | TV9 Telugu

కీరా దోసలో మీరు ఎక్కువగా ఉంటుంది. ఇందులో దాదాపు 96 శాతం వరకు నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల.. ఎండకాలంతో చెమట రూపంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందచ్చు. తద్వారా శరీరానికి చలువ కూడా చేస్తుంది. కోల్పోయిన ఎనర్జీ కూడా  తిరిగి వస్తుంది.  ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి.

ఈ కీరా దోసకాయను రోజూ తినడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

కీరా దోసను రోజూ సలాడ్స్‌లో భాగం చేసుకుంటే మంచింది. ఇంకా కొవ్వు శాతం తక్కువగా ఉండే పెరుగులో ముంచుకుని తినడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుంది.

బీపీ  సమస్యతో బాధపడుతున్న వారికి కీరా దోసకాయ తినడం వల్ల  ఉపశమనం కలుగుతుంది.

కీరా దోస మెదడకు కూడా మంచింది. జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు నాడీవ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది.
 ఒత్తిడి  వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ దోసకాయలో ఉండే 'బి' విటమిన్..  ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా కాపాడుతుంది.

ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.  నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందిస్తుంది. దంతాల ఆరోగ్యానికి కూడా మంచిది.

 కీరాలో ఎక్కువగా ఉండే విటమిన్ 'కె'..  మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో క్యాల్షియం గ్రహించేలా చేస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా తయారవుతాయి.  గుండె జబ్బులు కూడా దూరమవుతాయి.

కళ్లు అలసిపోవడం, కళ్ల కింద క్యారీ బ్యాగ్స్.. వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది చక్కని రెమిడి.  చల్లటి కీరాదోస ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకుంటే  మంచి ఫలితం ఉంటుంది.

చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్.. వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇందులో ఉండే సిలికా వల్ల జుట్టు, గోళ్లు దృఢంగా తయారవుతాయి. అలాగే ఇది చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది.

కీరా దోస క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల బాడీ టెంపరేచర్​ కూడా అదుపులో ఉంటుంది. అందుకే జ్వరంతో బాధపడుతున్న వారికి దీన్ని ఎక్కువగా తినిపిస్తారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.