Hair growth: టీపొడితో జుట్టుకు ఇలా చేస్తే.. ఇక హెయిర్‌ గ్రోత్‌ మాములుగా ఉండదు..!

Hair growth: మ‌నం టీ పొడి ఉప‌యోగించి జుట్టు రాలడాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంతో పాటు జుట్టును నల్ల‌గా, ఒత్తుగా, కాంతివంతంగా త‌యారు చేస్తుంది

Hair growth: టీపొడితో జుట్టుకు ఇలా చేస్తే.. ఇక హెయిర్‌ గ్రోత్‌ మాములుగా ఉండదు..!
Tea powder for hair growth


మనకేం జుట్టు ఏం మోకాళ్లవరకూ ఉండాల్సిన పనిలేదు.. కాస్త పొడవుగా, నల్లగా ఒత్తుగా ఉంటేచాలు.. ఇదేం అంత పెద్ద కోరికకాదు.. అయినా అలా ఉండటం లేదే..? ఈ హెయిర్‌ కోసం నా పాకెట్‌ మనీ అంతా వాడేస్తున్నా.. ఖాళీగా ఉన్న టైమ్‌ అంతా దీనిమీదె పెడుతున్నా.. అయినా నో రిజల్ట్‌.. ఛీ..ఏం చేస్తే జుట్టురాలడం తగ్గి అందంగా అవుతుందో అని చాలామంది అమ్మాయిలు తెగ బాధపడుతుంటారు.. మీరు ఇదే లిస్ట్‌లో ఉన్నారా..? ఈ జుట్టు రాల‌డాన్ని ఒక చిట్కాను ఉప‌యోగించి త‌గ్గించుకోవ‌చ్చు. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నం టీ పొడి ఉప‌యోగించి జుట్టు రాలడాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంతో పాటు జుట్టును నల్ల‌గా, ఒత్తుగా, కాంతివంతంగా త‌యారు చేస్తుంది. టీతో తలనొప్పి తగ్గుతుంది అంటారు.. ఇప్పుడు టీతో తలసమస్యను కూడా తగ్గించేయొచ్చు.. కాఫీతో పోలిస్తే టీ లో కెఫిన్ అనే ప‌దార్థం అధికంగా ఉంటుంది. జుట్టుకు సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల‌ను టీ పొడితో తగ్గించుకోవ‌చ్చు. జుట్టు కుదుళ్ల‌కు కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించి జుట్టును బ‌లంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్య‌వంతంగా బ‌లంగా ఉండేలా చేస్తాయి. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్ల‌ను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడాయ్య‌క 2 టీ స్పూన్ల టీ పొడిని వేసి బాగా మ‌రిగించాలి.

త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ నీరు చ‌ల్లారిన త‌రువాత జుట్టు కుదుళ్ల‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంది. త‌రువాత ష‌వ‌ర్ క్యాప్‌తో లేదా ట‌వ‌ల్‌తో జుట్టును ద‌గ్గ‌రికి ముడి వేసి ఉంచాలి. ఒక గంట త‌రువాత జుట్టును గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేయాలి. త‌ల‌స్నానం చేసే ప్ర‌తిసారి ఈ చిట్కాను పాటించడం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు నిగ‌నిగ‌లాడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.