కొబ్బరిపాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోండి..!

జుట్టుకు ఖరీదైన ఆయిల్స్‌ వాడితే బాగా పెరుగుతుంది అనుకుంటారు.. కానీ ప్యూర్‌ కోకోనట్‌ ఆయిల్‌ చాలు.. రాసుకోని మసాజ్‌ చేసుకుంటే.. కొద్దిరోజులకే మార్పు గమనిస్తారు. అలాగే కొబ్బరిపాలు కూడా జుట్టు పోషణకు బాగా ఉపయోగపడతాయి. కొబ్బరిపాలు కొబ్బరికాయల నుంచి వస్తాయి.. ఈ పాలను మనం ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు

కొబ్బరిపాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోండి..!


జుట్టుకు ఖరీదైన ఆయిల్స్‌ వాడితే బాగా పెరుగుతుంది అనుకుంటారు.. కానీ ప్యూర్‌ కోకోనట్‌ ఆయిల్‌ చాలు.. రాసుకోని మసాజ్‌ చేసుకుంటే.. కొద్దిరోజులకే మార్పు గమనిస్తారు. అలాగే కొబ్బరిపాలు కూడా జుట్టు పోషణకు బాగా ఉపయోగపడతాయి. కొబ్బరిపాలు కొబ్బరికాయల నుంచి వస్తాయి.. ఈ పాలను మనం ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. కొబ్బరిపాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం అందరికీ పెద్ద సమస్యగా మారింది. జుట్టు రాలిపోతే.. మానసికంగా చాలా బాధపడతారు.. అది అమ్మాయిలు అయినా, అబ్బాయిలైనా.. జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే కారణాలు చాలా ఉంటాయి. జుట్టు ఊడకుండా కొబ్బరి పాలతో ఆపేయవచ్చు తెలుసా..! కొబ్బరి పాల వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Hair loss: Who gets and causes
కొబ్బరి పాలలోని పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తాయి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కుదుళ్ళు బలంగా తయారై ఊడిపోకుండా ఉంటుంది. హెయిర్ స్టైలింగ్ కోసం హీటింగ్ సాధనాల వల్ల వెంట్రుకలు పాడవుతాయి. దీన్ని నివారించడానికి కొబ్బరి పాలు పనిచేస్తాయి. పొడిబారడం వల్ల కూడా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. కొబ్బరి పాలను జుట్టుకు పట్టిస్తే, జుట్టు తేమగా ఉంటుంది. పొడిబారే సమస్య ఉండదు..
కొబ్బరి పాలల్లో ప్రోటిన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టు అందంగా, ఆరోగ్యంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. కొబ్బరి పాలను జుట్టు కుదుళ్లకు పట్టిస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది. అందంగా మెరుస్తుంది. 

కొబ్బరి పాలు ఎలా చేయాలంటే..

ఒక కొబ్బరి కాయను తీసుకోండి. అది పగలగొట్టాక అందులోని కొబ్బరిని తీయండి. ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక జార్ లో వేసి.. మెత్తగా మిక్సీ పట్టండి.. ఆ తర్వాత ఒక వస్త్రంలోకి కొబ్బరి పేస్ట్ తీసుకుని మూట కట్టుకోవాలి. తర్వాత దానిని గట్టిగా పిండుతూ గిన్నెలోకి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఆ తర్వాత దీనిని జుట్టుకు ఉపయోగించండి.
అయితే కొబ్బరి పాలను జుట్టు పట్టించేముందు.. జుట్టు శుభ్రంగా, నూనె(Oil) లేకుండా చేయాలి. తర్వాత ఈ కొబ్బరి పాలను రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్లకు పట్టించాలి. రాత్రంతా అలానే ఉంచాలి. ఏం కాదు. ఉదయాన్నే తలస్నానం చేయండి. రసాయనాలు తక్కువగా ఉంటే షాంపూను ఉపయోగించడం మంచిది. ఇలా వారానికి ఒకసారి చేయండి. జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. రెండు, మూడు నెలల పాటు ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

కొబ్బరిపాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోండి..!

కొబ్బరి పాలలోని పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తాయి. 
ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కుదుళ్ళు బలంగా తయారై ఊడిపోకుండా ఉంటుంది. 
హెయిర్ స్టైలింగ్ కోసం హీటింగ్ సాధనాల వల్ల వెంట్రుకలు పాడవుతాయి. దీన్ని నివారించడానికి కొబ్బరి పాలు పనిచేస్తాయి. 
పొడిబారడం వల్ల కూడా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. కొబ్బరి పాలను జుట్టుకు పట్టిస్తే, జుట్టు తేమగా ఉంటుంది. పొడిబారే సమస్య ఉండదు..
కొబ్బరి పాలల్లో ప్రోటిన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టు అందంగా, ఆరోగ్యంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. 
కొబ్బరి పాలను జుట్టు కుదుళ్లకు పట్టిస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది. అందంగా మెరుస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.