విటమిన్‌ సీ సిరమ్‌ స్కిన్‌ అసలు మంచిదేనా..? దీని ప్రభావం చర్మంపై ఎంత ఉంటుంది..?

స్కిన్‌ స్కేర్‌ ప్రొడెక్ట్స్‌ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. వీటిల్లో ఏది వాడాలి, ఏది మంచిది అనే విషయాలపై మనకు అవగాహన ఉండదు. యాడ్స్‌ చూసి, పక్కన ఫ్రెండ్‌ వాడుతుంది కదా అని వాడితే అది పకడపోవచ్చు. అయితే అందరూ విటమిన్‌ సీ సిరమ్‌ ఫేస్‌కు బాగా సెట్‌ అవుతోంది అంటారు. అసలు ఇది నిజంగానే సెట్‌ అవుతోందా..? అందరూ దీన్ని వాడొచ్చా.. విటిమిన్‌ సీ సిరమ్‌ ప్రభావం చర్మం మీద ఎంత వరకూ ఉంటుంది. ఈ వివరాలను ఈరోజు తెలుసుకుందాం. 

విటమిన్-సి సీరమ్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. చర్మంపై డార్క్ స్పాట్స్‌ను తగ్గిస్తాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తూ చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది. లిపోసోమల్ విటమిన్ సీ గోల్డ్ స్టాండర్డ్‌గా నిలుస్తుంది, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన చర్మ కణాలకు పోషకాలు చేరేలా చేస్తుంది. 
Vitamin C Face Serum for Glowing Skin 50ml - Dr. Rashel
చర్మ సంరక్షణ కోసం విటమిన్ -సి ప్రొడక్ట్ ఎంపిక సమయంలో ‘లిపోసోమల్‌’కు ప్రాధాన్యత ఇవ్వాలని మిట్టల్ సూచించారు. దీనిలోని ప్రత్యేకమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు ప్రకాశవంతమైన ఛాయను ప్రోత్సహిస్తాయి. విచ్ హాజెల్, గ్రీన్ టీ, హైలురోనిక్ యాసిడ్‌ వంటి సమ్మేళనాలతో విటమిన్ సి సీరమ్‌ను రూపొందించారు. విచ్ హాజెల్ చర్మాన్ని రక్షిస్తుంది. గ్రీన్ టీ ఉపశమనాన్ని, టోన్‌లను అందిస్తుంది. హైలురోనిక్ యాసిడ్ చర్మాన్ని తేమతో ఉండేలా చేస్తుంది. 
 
విటమిన్ సి సీరమ్ చర్మంపై గీతలు, ముడతలను తగ్గించే కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. స్కిన్ టోన్‌ని నయం చేయడానికి మెలనిన్ ఏర్పడటాన్ని నిరోధించడం ద్వారా చర్మ ఛాయను ప్రకాశవంతం చేస్తుంది.
విటమిన్ సి సీరమ్ రోజు ఉపయోగించడం వల్ల స్కిన్‌ టోన్‌పై రోజంతా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఎండ, కాలుష్యం వల్ల కలిగే ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గిస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.