జామ ఆకులతో జుట్టు వద్దన్నా పెరుగుతుంది..! ఇలా చేయండి చాలు

జామకాయలు మనకు ఏ సీజన్‌లో అయినా దొరుకుతాయి. పైగా పండ్లలో కెల్లా తక్కువ ధరకు వచ్చే వాటిల్లో జామపండ్లు కూడా ఒకటి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మధుమేహులకు ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు ఒక జామకాయ

జామ ఆకులతో జుట్టు వద్దన్నా పెరుగుతుంది..! ఇలా చేయండి చాలు


జామకాయలు మనకు ఏ సీజన్‌లో అయినా దొరుకుతాయి. పైగా పండ్లలో కెల్లా తక్కువ ధరకు వచ్చే వాటిల్లో జామపండ్లు కూడా ఒకటి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మధుమేహులకు ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు ఒక జామకాయ తింటే షుగర్ లెవల్స్‌ కంట్రోల్లో ఉంటాయి. జామకాయలే కాదు ఆ చెట్టు ఆకుల్లో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామఆకులతో టీ చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈరోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలతో తెగ ఇబ్బంది పడుతుంటారు. ఏం చేసినా, ఎన్ని ఆయిల్స్‌ వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. రాలుతున్న జుట్టుకు జామ ఆకులు మంచి మెడిసిన్‌ తెలుసా? ఆయుర్వేదంలో జామ ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మనం జామ ఆకులను ఉపయోగించి జుట్టు సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.!

జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకుల‌ను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు పోతాయి. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి. జామ ఆకులతో టీ చేసుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి. చిన్నప్పుడు జామఆకులతో చింతపండు, ఉప్పు పెట్టి తినే వాళ్లం గుర్తుందా..? అసలు ఆ టేస్ట్‌ భలే ఉంటుంది కదా..! మీరు ఎప్పుడైనా తిన్నారా..?

జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి. దగ్గు తగ్గిపోతుంది. జామ ఆకుల్లో విటమిన్‌- బి పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. 

జుట్టుకు ఎలా వాడాలంటే

గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు. దీంతో పాటు జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి. అలాగే జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. కాంతివంతంగా ఉండి మెరుస్తుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌కు జామ ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇంట్లో జామ చెట్టు ఉంటే ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. లేకున్నా పక్కింట్లో ఉంటే మనం కాయలనే వదలం ఇక ఆకులతో ఇంత లాభాలు ఉన్నాయని తెలిశాక వదులుతామా..? ఛాన్సే లేదు హ్యాపీగా వారానికి ఒకసారి ట్రై చేసి జుట్టు సమస్యలను తగ్గించుకోండి.!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.