Yuzu : అందంగా ఉండాలంటే.ఈ పండును వాడితే చాలట.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ 

అందంగా ఉండాలంటే..ఈ పండు తినాలంతె .. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.. ఇప్పుడు మార్కెట్‌లో ఈ పండుదే హవా..! సౌందర్య ప్రపంచంలో ఈ పండు ఇప్పుడు రారాజు. బ్యూటీ ప్రొడెక్ట్స్‌లోనూ ఈ పండునే ఎక్కువగా వాడుతున్నారట.. అదే 'Yuzu'.. ఏంట్రా ఈ పేరు కూడా వినలేదు కదా అనుకుంటున్నారు.. ఇప్పుడు వినండి మరీ..!

Yuzu  : అందంగా ఉండాలంటే.ఈ పండును వాడితే చాలట.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ 
Yuzu fruit


చర్మానికి సిట్రస్‌ ఫ్రూట్స్‌ మంచివి అంటారు. ముఖ్యంగా కివీ పండు తింటే.. ఫేస్‌ బాగుంటుంది.. అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెప్తారు.. అందంగా ఉండాలంటే..ఈ పండు తినాలంతె.. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.. ఇప్పుడు మార్కెట్‌లో ఈ పండుదే హవా..! సౌందర్య ప్రపంచంలో ఈ పండు ఇప్పుడు రారాజు. బ్యూటీ ప్రొడెక్ట్స్‌లోనూ ఈ పండునే ఎక్కువగా వాడుతున్నారట.. అదే 'యుజు'.. ఏంట్రా ఈ పేరు కూడా వినలేదు కదా అనుకుంటున్నారు.. ఇప్పుడు వినండి మరీ..!
 
ఇది తూర్పు ఆసియాకు చెందిన సిట్రస్ ఫ్రూట్. ఈ పండు.. రెండు రకాల సిట్రస్ జాతికి చెందిన చెట్ల సంకరణ వల్ల పుట్టింది. ఇది పసుపు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని రుచి ద్రాక్ష పండు, నిమ్మ కలిపి తింటే ఎలా ఉంటుందో... అలా ఉంటుందట. దీన్ని సలాడ్‌లలో, డ్రింకులు, డిసర్ట్ తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ఉపయోగిస్తారు. 

యుజు పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయల కంటే రెండు రెట్లు, నారింజ కంటే ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి దీనిలో ఉంటుందని నిపుణులు అంటున్నారు.. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
యుజు పండులో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని తేమ ఉంచడంలో సహాయపడుతుంది. యుజు ఫ్రూట్‌లోని విటమిన్ సి, పాలీఫెనాల్స్ చర్మాన్ని శుభ్రపరుస్తాయి. మలినాలను, టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడతాయి.
యుజు పండు చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఇది డార్క్ స్పాట్స్, రంగు మారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యుజు పండులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మొటిమలు, ఇతర చర్మ వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి.

యుజు పండును ఎలా వాడేది.?

  •  యుజు పండు రసం, బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ కలిపి బాడీ స్క్రబ్‌ను తయారుచేసుకోవాలి. ఆ స్క్రబ్‌తో రుద్దితే చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి.
  • మీ స్నానంలో యుజును ఉపయోగించండి. మీ శరీరం మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి మీ స్నానపు నీటిలో కొన్ని చుక్కల యుజు ముఖ్యమైన నూనెను జోడించండి.
  • యుజు రసాన్ని, తేనె, అవకాడో పండు గుజ్జు కలిపి హెయిర్ మాస్క్‌ని తయారుచేసుకోవాలి. ఈ మాస్క్ జుట్టుకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు బలంగా మారుతాయి.
  • యుజు పండు రసాన్ని లేదా గుజ్జును... పెరుగు, తేనెలో కలిపి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును ముఖంపై అప్లయ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
  •  పెదవుల కోసం యుజు స్క్రబ్ తయారుచేసుకోవచ్చు. యుజు జ్యూస్, చక్కెర, కొబ్బరి నూనెను కలపడం ద్వారా స్క్రబ్‌ను చేయచ్చు. దీనితో పెదవులపై రుద్దితే మృత కణాలు పోయి, పెదవులు గులాబీ రంగులో మెరుస్తాయి. 
యుజు పండుతో నిత్య యవ్వనం
  • యుజు పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
  • మలినాలను, టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడతాయి.
  • చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది.
  • డార్క్ స్పాట్స్, రంగు మారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • మొటిమలు, ఇతర చర్మ వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.