పలచగా ఉన్న కనుబొమ్మలు ఒత్తుగా ఎలా మార్చుకోవాలలంటే..!

ముఖ అందంలో కనుబొమ్మలా ప్రత్యేకత వేరని చెప్పాలి. ఒత్తుగా ఉండే కనుబొమ్మలు ముఖానికి అందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా చూడగానే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే చాలామందికి కనుబొమ్మలు ఒత్తుగా ఉండవు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది. 

పలచగా ఉన్న కనుబొమ్మలు ఒత్తుగా ఎలా మార్చుకోవాలలంటే..!


ముఖ అందంలో కనుబొమ్మలా ప్రత్యేకత వేరని చెప్పాలి. ఒత్తుగా ఉండే కనుబొమ్మలు ముఖానికి అందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా చూడగానే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే చాలామందికి కనుబొమ్మలు ఒత్తుగా ఉండవు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది...కనుబొమ్మలని ముఖ్యంగా చక్కగా తీర్చిదిద్దుకోవాలి. వాటి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఐబ్రోస్ చేయించినప్పుడు ప్రతిసారి ఒకే దగ్గర చేయించడం వల్ల కనుబొమ్మల తీరు చెడిపోకుండా ఉంటుంది.

కనుబొమ్మలకి మేకప్ ఎక్కువగా ఉపయోగించకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. లేదంటే వాటిలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ కచ్చితంగా వెంట్రుకల పై పడే అవకాశం ఉంటుంది. అవసరం లేనప్పుడు వాటిని అలా వదిలేయడమే మంచిది.
కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి సహజంగా ఉండే నూనెలను వాడాలి. ముఖ్యంగా ఆముదం, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని కనుబొమ్మల పైన రాసుకోవాలి. రాత్రి సమయంలో ఇలా రాసి నిద్రపోవడం వల్ల కొన్ని రోజులకే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
బయటికి వెళ్ల లేనప్పుడు కనుబొమ్మలకి అలోవెరా ఆముదం వంటివి రాయాలి. కనురెప్పలు పెరిగేందుకు సీరమ్ కూడా అప్లై చేయొచ్చు. ఇలా రాయటం వల్ల కనుబొమ్మల అందం రెట్టింపు అవుతుంది.
అలాగే చాలామంది ఇంట్లోనే కనురెప్పల్లి ప్లక్కర్ తో తీస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కనుబొమ్మల తీరు చెడిపోయే అవకాశం ఉంటుంది వీటి విషయంలో తప్పకుండా నిపుణుల సలహా నే తీసుకోవాలి.
కనుబొమ్మలను దువ్వటం అలవాటు చేసుకోవాలి వాటికి సంబంధించిన బ్రష్ తో నెమ్మదిగా దువ్వుతూ ఉండటం వల్ల ఒత్తుగా పెరుగుతాయి.
పోషకాహారం సైతం కనుబొమ్మలను పెంచుతుంది నీటిని ఎక్కువగా తాగుతూ తగిన పోషకాహారం తీసుకుంటే వీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తుదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.