జుట్టు రాలడం కామన్‌.. కానీ కారణాలు మాత్రం వేరు.. మీ సమస్యకు కారణం ఏంటి..?

అమ్మాయిల నుంచి ఆన్టీల వరకూ ఎవర్ని కదిలించినా కామన్‌ సమస్య.. జుట్టు రాలిపోతుంది. అందరూ జట్టు రాలిపోతుంది అని తెగఫీల్‌ అవుతుంటారు. జుట్టు పెరగడానికి ఎవరు ఏం చెప్పినా చేసేస్తుంటారు. ఏమో ఏదో ఒకటి క్లిక్‌..

జుట్టు రాలడం కామన్‌.. కానీ కారణాలు మాత్రం వేరు.. మీ సమస్యకు కారణం ఏంటి..?


అమ్మాయిల నుంచి ఆన్టీల వరకూ ఎవర్ని కదిలించినా కామన్‌ సమస్య.. జుట్టు రాలిపోతుంది. అందరూ జట్టు రాలిపోతుంది అని తెగఫీల్‌ అవుతుంటారు. జుట్టు పెరగడానికి ఎవరు ఏం చెప్పినా చేసేస్తుంటారు. ఏమో ఏదో ఒకటి క్లిక్‌ అవుతుందిలే అని..! ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ సమస్య ఒక్క మహిళలకే కాదు..పురుషులకు కూడా ఉంటుంది. ఎక్కడ బ‌ట్ట‌త‌ల వ‌స్తుందేమోన‌ని వాళ్ల భయం. జుట్టు రాలిపోవడానికి అసలు కారణాలు ఏంటో మీకు తెలిస్తే.. దాన్ని బట్టి వైద్యం చేయొచ్చు.. సమస్య కామన్‌ అయినా కారణాలు వేరు.. కాబట్టి మీ సమస్యకు కారణం ఏంటో ముందు అది తెలుసుకోండి..!

హైపో థైరాయిడిజం లేదా హైప‌ర్ థైరాయిడిజం.. ఈ రెండింటిలో ఏ స‌మ‌స్య ఉన్నా స‌రే జుట్టు రాలిపోతుంది. థైరాయిడ్ హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ఈ స‌మ‌స్య వ‌స్తుంది.

గ‌ర్భం ధరించిన స్త్రీల‌కు స‌హ‌జంగానే జుట్టు రాలిపోతుంది. అయితే వారు ప్ర‌స‌వించాక ఈ స‌మ‌స్య నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు.

డిప్రెష‌న్, విటమిన్ ఎ, క్యాన్సర్ మందుల‌ను వాడినా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంటుంది.

వంశ పారంప‌ర్యంగా కూడా జుట్టు రాలిపోయే స‌మ‌స్య వ‌స్తుంది. ఇంట్లో పెద్ద‌ల‌కు ఎవ‌రికైనా బ‌ట్ట‌త‌ల ఉంటే వారి పిల్ల‌ల‌కు జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది. భవిష్యత్తులో మీకు కూడా బట్టతల వచ్చే సమస్య ఉంటుంది.

ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌గా ఉన్న‌వారికి కూడా జుట్టు రాలిపోతుంది. 75 శాతం మందికి జుట్టు రాలిపోయే స‌మ‌స్య ఈ కార‌ణం వ‌ల్లే వ‌స్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తే జుట్టు రాలిపోయే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ప‌లు ర‌కాల పోష‌క ప‌దార్థాల లోపం ఉన్నా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది.

శిరోజాల‌కు స్ట‌యిల్ త‌ర‌చూ చేయించ‌డం, ర‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడ‌డం, కాలుష్యం, హెయిర్ డ్ర‌య్య‌ర్‌ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా జుట్టు రాలిపోతుంది.

ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారిలోనూ జుట్టు రాలుతుంది. అలాగే జుట్టు త‌డిగా ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా రాలుతుంది. త‌ల‌స్నానం చేయ‌గానే వెంట‌నే జుట్టును ఆర‌బెట్టుకోవాలి. త‌డి జుట్టు మీద దువ్వ‌కూడ‌దు.

బాగా చ‌ల్ల‌గా, బాగా వేడిగా ఉండే నీటితో త‌ల‌స్నానం చేయ‌రాదు. గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.