White hair : యుక్తవయసులో వచ్చిన తెల్లజుట్టును 90 రోజుల్లో ఈ చిట్కాలతో నల్లగా మార్చేయొచ్చు..!

Teenage లోనే జుట్టు తెల్లగా మారుతుంది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి.. కారణాలు ఏమైన కానీ.. white hair ను న‌ల్ల‌గా మార్చుకునేందుకు ఆయుర్వేదంలో ప‌లు అద్భుత‌మైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

White hair : యుక్తవయసులో వచ్చిన తెల్లజుట్టును 90 రోజుల్లో ఈ చిట్కాలతో నల్లగా మార్చేయొచ్చు..!
turn white hair into black hair


వృధ్యాప్యంలో white hair  వస్తేనే ఈరోజుల్లో ఎవరూ ఊరుకోవడం లేదు. కలరేసి కవర్‌ చేస్తున్నారు. కానీ యుక్తవయసులోనే కొందరికి white hair వస్తుంది.. ఏం చేయాలి.. కలర్‌ వేస్తే.. జుట్టు దెబ్బతింటుంది. అలానే ఉంచితే.. ప్రతి ఒక్కడు అడిగేవాడే.. అరే ఏంట్రా అప్పుడే వైట్‌ హెయిర్‌ వచ్చేసిందా..? అంటూ.. అబ్బో ఈ బాధ పడేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి.. కారణాలు ఏమైన కానీ.. తెల్ల‌ని జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు ఆయుర్వేదంలో ప‌లు అద్భుత‌మైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర ఆకులు, కరివేపాకుల‌ను సమానంగా తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా ప‌ట్టుకోండి. అనంత‌రం దాని నుంచి ర‌సం తీయండి. ఆ ర‌సాన్ని ఒక క‌ప్పు మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గడుపునే తాగండి.

మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగండి.
సాయంత్రం 6 గంటల సమయంలో ఉసిరికాయ‌ జ్యూస్‌ను రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా క‌లిపి తాగాలి.
రాత్రి పడుకునే ముందు మునగాకు పౌడర్‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా క‌లిపి తాగండి.
ఈ చిట్కాలన్నీ క్రమం తప్పకుండా.. 90 రోజుల పాటించండి.. తెల్ల జుట్టు నల్లగా మారడమే కాదు..జుట్టు రాలదు.. బాగా పెరుగుతుంది. ఒత్తుగా ధృడంగా ఉటుంది.. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్‌ ఆశ్చర్యపోతారు. ఇవి అన్ని చిట్కాల్లానే లైట్‌ అనుకుంటారేమో.. పైన చెప్పిన ప్రతి దాంట్లో జుట్టుకు ఏవైతే మేలు చేస్తాయో అని అన్నీ ఉన్నాయి.. వాటిని తాగడం వల్ల హెయిర్‌కు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. మూడు నెలల పాటు వాటిని క్రమం తప్పకుండా పాటించడం వల్ల సమస్యలన్నీ మాయం అయిపోతాయి. మందుల వల్ల జుట్టు రాలిపోయిన వాళ్లు కూడా వీటిని ట్రై చేయొచ్చు. జుట్టు అనేది కేవలం అందాన్నే కాదు.. ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది. ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారు కదా..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.