పిల్లల్లో వచ్చే కండ్లకలకల లక్షణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇది వర్షాకాలం. రోగాలకు కూడా ఇదే సరైన కాలం. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఏదో ఒక అనారోగ్యం భారిన పడుతుంటారు.

పిల్లల్లో వచ్చే కండ్లకలకల లక్షణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Conjunctivitis in children


ఇది వర్షాకాలం. రోగాలకు కూడా ఇదే సరైన కాలం. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఏదో ఒక అనారోగ్యం భారిన పడుతుంటారు. ఈ సీజన్‌లో అందరికీ కామన్‌గా వచ్చే సమస్యల్లో కండ్లకలకలు కూడా ఒకటి. చిన్నపిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరికి వస్తుంది. పిల్లలు స్కూల్‌కు వెళ్తారు. వాళ్లతో కలిసి ఆడుకుంటారు. కాబట్టి ఎవరికైనా ఒక్కరికి వచ్చినా అదితోటి వారికి కూడా వస్తుంది. అందుకే కండ్లకలకలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
Tuesday Q and A: Eye infections common, especially in children - Mayo  Clinic News Network
కండ్ల కలక కేసులు డిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ కేసులు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. అందుకే అంతటా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ చేతులు కడగడం, కళ్లు ముట్టుకోకపోవడం, చేతి రుమాళ్లను ఒకరితో పంచుకోకపోవడం, సామాజిక దూరం పాటించడం లాంటివి తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
లక్షణాలు  
కళ్లు ఎరుపెక్కడం, దురద, కను రెప్పలు ఉబ్బినట్టు అనిపించడం దీని లక్షణాలు. 
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే కళ్ల నుంచి నలక ఎక్కువగా రావొచ్చు. అయితే కంట్లో డ్రాప్స్ వేసుకోవడం వల్ల వీటినుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. లక్షణాలన్నీ తగ్గడానికి వారం నుంచి రెండు వారాల సమయం పట్టొచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పిల్లలు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. దానివల్ల క్రిములు చేరవు. లేదంటే చేతులు కంట్లో పెట్టుకున్నపుడు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
పిల్లలు కళ్లు తరచూ ముట్టుకోకుండా, నలవకుండా చూసుకోవాలి. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుందని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి.  
తుమ్మినపుడు, దగ్గినపుడు వైరస్ బారిన పడకుండా టిష్యూ అడ్డుపెట్టుకోవడం అలవాటు చేయాలి. దానివల్ల గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు ఒకరినుంచి ఒకరికి సోకకుండా ఉంటాయి.
కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సులు వంటివాటిని ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
 
తోటి పిల్లలకు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కాస్త దూరంగా ఉండాలని పిల్లలకు సూచించాలి.
లక్షణాలు మరీ ఎక్కువైతే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అలానే సొంతవైద్యం చేయించుకుంటే.. ప్రమాదం కావొచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.