పురుషాంగం పెరగడం ఏ వయసులో మొదలై ఎప్పుడు ఆగిపోతుంది..?

మగాడి ఆయువంతా పురుషాంగంలోనే ఉంటుందంటారు. వీటిపై జనాలకు చాలా అపోహలు ఉన్నాయి. ఇందులో ఏ సమస్యలు ఉన్నా.. మానసికంగా, శారీరంగా వీక్‌ అవుతారు. పురుషాంగం వ్యక్తికి వ్యక్తికి సైజులో తేడా ఉంటుంది.

పురుషాంగం పెరగడం ఏ వయసులో మొదలై ఎప్పుడు ఆగిపోతుంది..?


మగాడి ఆయువంతా పురుషాంగంలోనే ఉంటుందంటారు. వీటిపై జనాలకు చాలా అపోహలు ఉన్నాయి. ఇందులో ఏ సమస్యలు ఉన్నా.. మానసికంగా, శారీరంగా వీక్‌ అవుతారు. పురుషాంగం వ్యక్తికి వ్యక్తికి సైజులో తేడా ఉంటుంది. అసలు ఏ వయసు వరకూ పెరుగుతుంది. ఎప్పుడు పెరగడం ఆగిపోతుంది. ఇలాంటి విషయాలు అన్నీ తెలుసుకుందాం.
సాధారణంగా పురుష జననేంద్రియాలపై అనేక అపోహలు ఉన్నాయి. మీ జననేంద్రియాలను ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా, ఇది మీ లైంగిక జీవితానికి కూడా సంబంధించినది. లైంగిక ఆనందంలో పురుషాంగం పరిమాణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా మంది పురుషులు తమ పురుషాంగం పొడవు, పరిమాణాన్ని పెంచడానికి చికిత్సలు, చిట్కాలు కూడా పాటిస్తుంటారు.
పురుషాంగం ఎప్పుడు పెరగడం ప్రారంభిస్తుంది? ఎప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది? అనే విషయాలపై పురుషులకు స్పష్టమైన అవగాహన ఉండదు. మగవారు సాధారణంగా యుక్తవయస్సులో మానసికంగా, శరీరకంగానూ అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు. యుక్తవయస్సు ప్రారంభమయ్యే సాధారణ వయస్సు పరిధి 9-14 సంవత్సరాల మధ్య ఉంటుంది.
Organ Systems: All 11 and What They Do
కొన్ని సందర్భాల్లో యుక్తవయస్సు తర్వాత పురుషాంగం పెరుగుతుంది. యుక్తవయస్సు సాధారణంగా మగవారిలో 12 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. ఇది సగటు వయస్సు. శారీరక అభివృద్ధిని బట్టి వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. వృషణాల పెరుగుదల పురుషులలో యుక్త వయస్సుకు మొదటి సంకేతం. ఇది స్క్రోటమ్‌లో మార్పులతో ప్రారంభమవుతుంది. స్క్రోటమ్ చర్మం నల్లబడుతుంది, విస్తరిస్తుంది. చర్మం సన్నగా మారుతుంది. చిన్న గడ్డలు, వెంట్రుకల కుదుళ్లను ఏర్పరుస్తుంది.
పురుషాంగం మొదట పొడవు, తరువాత అడ్డం పెరగడం ప్రారంభమవుతుంది. యుక్తవయస్సులో పెరుగుదల ప్రారంభమవుతుంది. ఈ పెరుగుదల సుమారు ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. పురుషాంగం పెరగడం అనేది సాధారణంగా 18 మరియు 21 సంవత్సరాల మధ్య ముగుస్తుంది. తర్వాత పెరుగుదల ఉండదు.
పురుషాంగం పెరుగుదల, ఆకారం, పరిమాణం మారుతూ ఉంటుంది. ఇది ప్రతి మనిషికి భిన్నంగా ఉంటుంది. మూత్రవిసర్జన లేదా సెక్స్ వంటి సాధారణ విషయాల్లో మీకు సమస్యలు ఉంటే తప్ప పురుషాంగం పరిమాణం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పురుషాంగం పరిమాణాన్ని పెంచే వైద్య, శస్త్రచికిత్స ఎంపికలు ఉన్నాయి. ఇవి మీకు అనేక ప్రమాదాలు, సమస్యలను కలిగిస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పురుషాంగం పరిమాణాన్ని సురక్షితంగా పెంచగలవని నిరూపించే అధ్యయనాలు ఏవీ లేవు. వైద్యుడి సలహా లేకుండా ఏమీ ప్రయత్నించకూడదు.
పురుషాంగం పరిమాణం మాత్రమే మీ భాగస్వామిని శృంగారంలో తృప్తి పరుస్తుందనుకోవడం కరెక్ట్ కాదు. మీ పురుషాంగం పరిమాణం మీ టెస్టోస్టెరాన్ స్థాయిలు, మగతనం, సంతానోత్పత్తికి సంకేతం కాదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.