కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆకాకరకాయ తినవచ్చా.. !

నోటికి ఎంతో రుచిగా అనిపించి కాయగూరల్లో ఆకాకరకాయ ఒకటి. చూడటానికి చిన్నగా అనిపించినప్పటికీ వీటి రుచి అమోఘం అని చెప్పాలి. వీటిని ఫ్రై చేసినా.. కూర చేసినా ఎంతో రుచిగా అనిపిస్తాయి. అయితే వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆకాకరకాయ తినవచ్చా.. !


నోటికి ఎంతో రుచిగా అనిపించి కాయగూరల్లో ఆకాకరకాయ ఒకటి. చూడటానికి చిన్నగా అనిపించినప్పటికీ వీటి రుచి అమోఘం అని చెప్పాలి. వీటిని ఫ్రై చేసినా.. కూర చేసినా ఎంతో రుచిగా అనిపిస్తాయి. అయితే వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినవచ్చా లేదా అనే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. అయితే ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం.
ఆకాకరకాయ తింటే ఆహా అనాల్సిందే..! - Manalokam

ఆకాకరకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఆకాకరకాయ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. ముఖ్యంగా ఇందులో ఉండే పీచు, ఫైబర్, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో పీచు విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి.
గర్భిణీలు వీటిని తీసుకోవడం వల్ల ఫోలేట్ అధికంగా లభిస్తుంది. ఇది కడుపులో ఉన్న బిడ్డ కణజాలం ఎదుగుదలకు సహాయపడుతుంది.
ముఖ్యంగా ఇందులో ఉండే ఫైటో న్యూట్రియన్స్ కాలేయం ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
మధుమేహం వ్యాధితో బాధపడేవారు వీటిని తరచూ తీసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి..
ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఆకాకరకాయను ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనా తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు సైతం ఆకాకరకాయను ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆహారంలో భాగం చేసుకోవచ్చు దీని వలన జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.