ఈ సలహాలతో మండిపోతున్న ఎండల్లో సైతం కూల్ గా ఉందామా..!

ఎండలు దంచి కొడుతున్నాయి.. బయటకు వెళ్తే చాలు చెమటలు కక్కాల్సిందే చిన్న పెద్ద తేడా లేకుండా సమస్యలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇలాంటి ఎండల్లో సైతం ఇబ్బంది లేకుండా హాయిగా బతికేయాలంటే కొన్ని సలహాలు పాటించాల్సిందే

ఈ సలహాలతో మండిపోతున్న ఎండల్లో సైతం కూల్ గా ఉందామా..!


ఎండలు దంచి కొడుతున్నాయి.. బయటకు వెళ్తే చాలు చెమటలు కక్కాల్సిందే చిన్న పెద్ద తేడా లేకుండా సమస్యలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇలాంటి ఎండల్లో సైతం ఇబ్బంది లేకుండా హాయిగా బతికేయాలంటే కొన్ని సలహాలు పాటించాల్సిందే.ఎండల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూల్ గా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ చిట్కాలతో ఆరోగ్యంతో పాటు అందం కూడా తేలిగ్గా కాపాడుకోవచ్చు..

రోజు రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తాగాలి..

శరీరానికి సరిపడా నీటిని తీసుకోవడం వల్ల డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది శరీరంలో ఎప్పుడైతే నీటి శాతం తక్కువగా ఉంటుందో చర్మం నిర్జీవంగా మారుతుంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ మొదలవుతాయి ప్రతి చిన్న పనికి నీరసంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఎండాకాలంలో తగినంత నీటిని తీసుకోవడం అత్యవసరం..

చెమటను పిలిచే తేలికపాటి దుస్తులు ధరించాలి..

తేలికగా చెమటని పిలిచే కాటన్ దుస్తులు ధరించడం మంచిది పాలిస్టర్ నైలాన్ వంటివి శరీరానికి ఇబ్బంది కలిగిస్తాయి చర్మానికి చిరాకు పుట్టిస్తాయి ఇవి బయటకు వెళ్ళినప్పుడు ఎండ నుంచి రక్షించకపోగా మరింత ఇబ్బందికి గురి చేస్తాయి అందుకే వీటికి దూరంగా ఉండాలి..

బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ తప్పనిసరి..

ఎలాంటి వారైనా బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం తప్పనిసరి కేవలం ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మాత్రమే ఈ విషయాన్ని ఎక్కువగా గుర్తుంచుకుంటారు కానీ ఎండ సమయంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరు వీటిని ధరించడం వల్ల కళ్ళు అలిసిపోకుండా ఉంటాయి అంతేకాకుండా కళ్ళు ఎర్రబడటం, మంటలు అలాంటి వాటికి దూరంగా ఉండటంతో పాటు కళ్ళ కింద నల్లటి వలయాలు దూరం అవుతాయి. 

బయటకు వెళ్తే ఏదో ఒక ఆహారాన్ని వెంట ఉంచుకోవాలి..

ఎండాకాలంలో ఎక్కువగా మీరే తాగాలి అనిపిస్తుంది అన్నం తినాలి అనిపించదు ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడపడితే అక్కడ కొందరు ఆహారాన్ని తీసుకోలేరు ఇలాంటి వారికి కచ్చితంగా కొద్దిపాటి ఆహారాన్ని అయినా వెంట ఉంచుకోవడం మంచిది అలాగే వారితో పాటు వాటర్ బాటిల్ తేలిగ్గా అరిగిపోయే ఆహారాన్ని ఉంచుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఏర్పడదు..

ఆల్కహాల్, టీ, కాఫీ కు దూరంగా ఉండాలి..

ఎండాకాలంలో కచ్చితంగా ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది శరీరాన్ని ఎక్కువగా డిహైడ్ చేస్తుంది. అంతేకాకుండా నోరు పొడుబారటం ఎక్కువగా దాహంగా అనిపించడం లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మిగతా చిరాకు వంటి లక్షణాలు ఉండటం వల్ల వీటికి దూరంగా ఉండాలి అలాగే టీ కాఫీ ఎక్కువగా తీసుకుని అలవాటు ఉన్నవారు ఎండాకాలంలో వీటికి దూరంగా ఉండటం మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.