బనానా టీ.. గుండె ఆరోగ్యానికి చాలా మంచిదట..!

బనానా టీ.. మీకు ఈ పేరు వినగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆఖరికి ఇది కూడా వదలడం లేదా అని. ఇప్పటికే ఆకులతో, పువ్వులతో టీలు చేసుకుని చాలా మంది తాగుతున్నారు.

బనానా టీ.. గుండె ఆరోగ్యానికి చాలా మంచిదట..!
Benefits of banana tea


బనానా టీ.. మీకు ఈ పేరు వినగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆఖరికి ఇది కూడా వదలడం లేదా అని. ఇప్పటికే ఆకులతో, పువ్వులతో టీలు చేసుకుని చాలా మంది తాగుతున్నారు. ఆఖరికీ పండ్ల తొక్కలతో కూడా చేస్తున్నారు. అవి అన్నీ ఆరోగ్యానికి మంచివే. హెర్బల్‌ టీ వల్ల బాడీ క్లీన్‌ అవుతుంది, కొవ్వు కరుగుతుంది. ఈ రోజు మనం అరటిపండుతో టీ ఎలా చేసుకోవాలో చూద్దామా.! మీరు ఏం కంగారుపడకండి, ఈ టీ చాలా టేస్టీగా ఉంటుంది, పైగా ప్రయోజనాలు కూడా ఎక్కువే.!


 
ఈ ప్రపంచంలో అరటి పండ్లు లేని దేశం లేదు. ముంబై లాంటి చోట్ల భోజనం బదులు... అరటి పండ్లు తింటూ బతికేస్తారు చాలా మంది. అరటి పండ్లలో పోషకాలు చాలా ఎక్కువ. వెంటనే ఎనర్జీ కావాలంటే ఇవే సరైనవి. బనానా టీ ఎలా తయారు చేయాలంటే.. 

గిన్నెలో 500 నుంచి 750 ఎంఎల్ నీటిని పోసి ఉడికించాలి. బనానాను బాగా కడిగి మొదలు, చివర కట్ చేసి నెమ్మదిగా ఉడుకుతున్న నీటిలో వదలాలి. ఇప్పుడు సిమ్‌లో 15-20 నిమిషాలు ఉడికించాలి. దాల్చిన చెక్క పొడి, తేనె అందులో వెయ్యొచ్చు. ఇవి వద్దూ అనుకుంటే స్కిప్‌ చేసినా పర్వాలేదు. తొక్కతో ఉన్న బనానాను తొలగించి ఆ నీటిని రెండు, మూడు కప్పుల్లో పోసి... ఇద్దరు ముగ్గురు తాగొచ్చు. ఉడికిన నీటిలోంచీ తీసిన బనానాను పారేయకుండా ఇతర రెసిపీల్లో, సలాడ్ల, బ్రెడ్‌ స్లైస్‌గా వాడుకోవచ్చు. లేదా మీరే తినేయవచ్చు.
 
అరటి పండును తొక్కతోగానీ, తొక్క తీసి గానీ మీకు నచ్చినట్లు ఉడికించవచ్చు. తొక్కతో ఉడికిస్తే దాన్ని బనానా తొక్క టీ అని పిలుస్తున్నారు. తొక్కతో ఎందుకు... అనవసరంగా అనుకోకండి. తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తొక్కతో ఉడికించిన బనానా టీ తాగితే ఎక్కువ ఫైబర్ మీకు అందుతుంది. అసలే ఫైబర్ వల్ల చాలా లాభాలున్నాయి. మలబద్ధకం సమస్య తీరుతుంది. పొట్టలో గడబిడ పోతుంది. అలాగే తిన్న ఆహారం వెంటనే బ్లడ్‌లో కలిసిపోకుండా ఫైబర్ చేస్తుంది. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారికి కొంత బెనిఫిట్ ఉంటుంది.
 
చాలా మంది బనానా టీలో దాల్చిన చెక్క లేదా తేనె కూడా ఫ్లేవర్ కోసం కలుపుకుంటున్నారు. రాత్రి వేళ నిద్రపోయే ముందు ఈ బనానా టీ తాగితే... అదిరిపోతుందని చాలా మంది చెబుతున్నారు. నిద్రైతే... వద్దన్నా వచ్చేస్తుంది. ఈ బనానా టీలో విటమిన్ B6 (వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది), పొటాషియం (గుండెకు మేలు), మెగ్నీషియం (బ్రెయిన్‌కి మేలు), మాంగనీస్, కాపర్ (1) ఉంటాయి
 
నీటిని ఉడికించాక అరటి పండును తొలగిస్తారు కాబట్టి ఈ టీ తాగడం వల్ల ఎక్కువ కేలరీలు రావు. బనానా టీలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి గుండెను కాపాడతాయి. రోగాలు రాకుండా చేస్తాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.