వీటితో ఇలా చేసుకొని తాగితే ఒంట్లో వేడి మొత్తం పోతుంది..

ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి, ఉక్కపొతతో జనాలు ఏ విధంగా ఇబ్బందులు పడతారో మనం రోజు చూస్తున్నాం..ఎండ వేడిని తట్టుకోవడానికి ఎన్నెన్నో రకాలుగా జ్యూస్ లను, శరబత్ లను తయారు చేసుకొని తాగుతారు..

వీటితో ఇలా చేసుకొని తాగితే ఒంట్లో వేడి మొత్తం పోతుంది..


ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి, ఉక్కపొతతో జనాలు ఏ విధంగా ఇబ్బందులు పడతారో మనం రోజు చూస్తున్నాం..ఎండ వేడిని తట్టుకోవడానికి ఎన్నెన్నో రకాలుగా జ్యూస్ లను, శరబత్ లను తయారు చేసుకొని తాగుతారు.. అలాంటి వారు బయట దొరికే సర్భత్ లను కాకుండా ఇంట్లో దొరికే వాటితో చేసుకోవడం వల్ల రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు..మనం సులభంగా తయారు చేసుకోగలిగిన షర్బత్ లలో రోస్ షర్బత్ కూడా ఒకటి. రోస్ సిరప్ ఉంటే చాలు వీటిని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ షర్బత్ చాలా రుచిగా ఉంటుంది... ఏం కావలి..ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

సబ్జా గింజలు – 2 టేబుల్ స్పూన్స్,
రోస్ సిరప్ – 75 ఎమ్ ఎల్,
నిమ్మరసం – ఒకటిన్నర టీ స్పూన్,
ఐస్ క్యూబ్స్ – 5,
నీళ్లు – 600 ఎమ్ ఎల్...
ముందుగా సబ్జా గింజలను నీటిలో వేసి నానబెట్టాలి. ఇప్పుడు గ్లాస్ లో రోస్ సిరప్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ వేసి కలపాలి. తరువాత చల్లటి నీళ్లు పోసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉండే రోస్ షర్బత్ తయారవుతుంది. ఇందులో నీళ్లకు బదులుగా సోడాను కూడా పోసుకోవచ్చు. ఈ షర్బత్ ను అందరూ ఎంతో ఇఫ్టంగా తాగుతారు. వేసవికాలంలో ఇలా షర్బత్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.. మీకు ఇది నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి...
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.