Diabetes : మధుమేహం విషయంలో అపోహలు ఇవే.. 

ప్రతి ఒక్కరిని వేధించే సమస్య Diabetes కొంత వయసు వచ్చేటప్పటికి ఈ సమస్య ఎక్కడ దరి చేరుతుందో అంటూ తెగ హైరానా పడుతూ ఉంటారు ఎందుకంటే బ్లడ్ షుగర్ వలన ఎన్నో ఇతర

Diabetes : మధుమేహం విషయంలో అపోహలు ఇవే.. 
Diabetes


ప్రతి ఒక్కరిని వేధించే సమస్య Diabetes కొంత వయసు వచ్చేటప్పటికి ఈ సమస్య ఎక్కడ దరి చేరుతుందో అంటూ తెగ హైరానా పడుతూ ఉంటారు ఎందుకంటే బ్లడ్ షుగర్ వలన ఎన్నో ఇతర వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి ముఖ్యంగా కళ్ళు మూత్రపిండాలు వంటివి మధుమేహానికి ఎటాక్ అవుతూ ఉంటాయి. అయితే మధుమేహం విషయంలో అపోహలు నిజాలు ఏంటో ఒకసారి చూద్దాం.. 

మధుమేహం పెద్ద సమస్య ఏమీ కాదు దీన్ని ఎక్కువగా పట్టించుకో అక్కర్లేదు..!

ఇది మంచి పద్ధతి కాదు..  మధుమేహం అనేది జీవన శైలి వ్యాధి అని దానికి సత్వర నిర్వహణ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. షుగర్ కు మందులు వాడకపోతే గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణం కావొచ్చని హెచ్చరిస్తున్నారు.

పంచదారతో షుగర్ వస్తుందా? 

చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం మంచిదనే మాట నిజమే కానీ కేవలం పంచదార వలన షుగర్ వస్తుంది అనేది మాత్రం అపోహ.. శరీరానికి సరైన శ్రమ లేకపోవడం ఒత్తిడి ఉబకాయం వంటి ఎన్నో కారణాలతో షుగర్ వస్తుంది.. 

ఇన్సులిన్ వాడుతున్నాం కదా వ్యాయామం చేయక్కర్లేదు.. !

ఇది ఎంత మాత్రం నిజం కాదు షుగర్ మందులు ప్రభావవంతంగా పనిచేయనప్పుడు మాత్రమే వైద్యులు ఇన్సులిన్ ఇస్తారు దాన్ని కారణంగా తీసుకొని వ్యాయామాలకు దూరంగా ఉండటం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు.. చక్కెర లోని స్థాయిలను ప్రతిరోజూ నియంత్రించడానికి రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇన్సులిన్ ఉత్పత్తికి, శరీర సున్నితత్వాన్ని పెంచడానికి వ్యాయామం ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు వారానికి కనీసం ఐదు రోజులు, రోజూ ఓ గంట సేపు వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.. 

స్త్రీలకు మధుమేహం ఉంటే గర్భం రాదు.. !

ఇది ఎంత మాత్రం నిజం కాదు వీరు అర్థం దాల్చి ఆరోగ్యంవంతమైన బిడ్డకు జన్మను ఇవ్వగలరు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.