షుగర్ వ్యాధిని నివారించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పాత జీవనవిధానంతో పోలిస్తే ఇప్పుడున్న జీవనవిధానంలో చాలా మార్పులు వచ్చేశాయి. ఎంతలా అంటే దాన్నుంచి బయట పడలేనంతలా. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త

షుగర్ వ్యాధిని నివారించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి


పాత జీవనవిధానంతో పోలిస్తే ఇప్పుడున్న జీవనవిధానంలో చాలా మార్పులు వచ్చేశాయి. ఎంతలా అంటే దాన్నుంచి బయట పడలేనంతలా. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త వయస్సులోనే షుగర్ వచ్చేస్తోంది. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి.

ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే......ఇక జీవితాంతం పడాల్సిందే. కొంతమందికి చిన్నవయసులోనే మధుమేహం వచ్చేస్తుంది. కొన్నిసార్లు పుట్టినపిల్లల్లోనూ ఉంటుంది. దానికి కారణం శిశువు కడుపులో ఉన్నప్పుడు తల్లికి షుగర్ ఉంటే.....అది పుట్టే శిశువుకు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే షుగర్ రాకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటివి పాటించాలి.

చక్కెర వ్యాధిని పూర్తిగా నయం చేయలేం కానీ.....కంట్రోల్ చేసుకోవచ్చు. అదేలా అంటే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుంది.ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మందులతో పాటు ఉదయం పూట తీసుకునే అల్ఫాహారం విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలని రోజూ ఆలోచించడం కంటే ఒక డైట్ చార్ట్ తయారుచేసుకుంటే.....క్రమపద్ధతిలో అలవాటైపోతుంది. అప్పుడు ఎలాంటి హైరానా ఉండదు.


చార్డ్ డైట్ అంటే మళ్లీ....డయాబెటిస్‌కు సంబంధించిందే తీసుకోవాలి. దానివల్ల శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించవచ్చు. మార్నింగ్ బ్రేక్ ఫాస్టులో ఉదయపు అల్ఫాహారంలో ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లు, ముడిధాన్యాలు, కొవ్వులేని మాంసం, చేపలు, ఎండు పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అన్నిటికన్నా అల్పాహారంలో రాగి జావ తీసుకుంటే మరీ మంచిది. ఎలాంటి ఆహార పదార్థాన్ని తీసుకున్నా కూరగాయల ముక్కలుగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక ఇడ్లీలో కూడా క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము కూడా చేర్చుకోవాలి. ఎప్పుడు ఒకే రకమైన పప్పు దినుసులను తినకూడదు. అప్పుడప్పుడు రకరకాల పప్పుధాన్యాలను తింటూ ఉండాలి. గారెలు తినాలనుకుంటే....అందులో కొంచెం క్యారెట్, పాలకూర వేసుకుని వడల్లా చేసుకుని తింటే బెటర్. నూనె వేసిన చపాతీల కన్నా పుల్కాలు తినడం మంచిది. పూరీలు అసలే తినకూడదు. తెల్ల బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ గుడ్డుతో కలిపి తీసుకోవాలి.

డయాబెటిస్ వాళ్లు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చలి కాలంలో బద్ధకం బాగా పెరిగిపోతుంది. దీనితో రెగ్యులర్‌గా పాటించే పద్దతి దారి తప్పుతుంది. అందుకని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాయామం చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఇన్సులిన్ లెవెల్స్‌ని పొందాలంటే కచ్చితంగా ప్రతి రోజు వ్యాయామం చేయడానికి సమయాన్ని కేటాయించాలి. 15 నిమిషాల పాటు కనీసం మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఉదయం పూట  లేదా సాయంత్రం పూట కాసేపు యోగా, వాకింగ్ చేయడం చాలా మంచిది.

ఒత్తిడికి మరియు డయాబెటిస్ కి మధ్య లింక్ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఒత్తిడి పెరిగితే కార్టిసోల్ లెవెల్స్ పెరిగి పోతాయి. దీంతో గ్లూకోజ్ పెరిగి రక్తంలో.....షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి కచ్చితంగా ఒత్తిడి లేకుండా ఉండడం ముఖ్యం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.