మీకు డయబెటీస్‌ ఉందా..? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి..!

షుగర్‌ వస్తే రక్తంలో చెక్కర స్థాయిలు పెరుగుతాయని అందరికీ తెలుసు.. అసలు రక్తంలో చెక్కర స్థాయిలు పెరగడం తగ్గడం ఎవరి చేతుల్లో ఉంటుంది..? అంటే దీన్ని కంట్రోల్‌ చేసేది ఇన్సులిన్‌. ఎవరి రక్తంలో అయితే ఇన్సులిన్‌ స్థాయిలు తక్కువగా ఉంటాయో.. వారి రక్తంతో చెక్కర స్థాయిలు అదుపులో ఉండవు అన్నట్లు. అందుకే షుగర్‌ మరీ ఎక్కువైతే.. ఇన్సులిన్‌ ఇంజక్షన్స్‌ కూడా వాడతారు.

మీకు డయబెటీస్‌ ఉందా..? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి..!


షుగర్‌ వస్తే రక్తంలో చెక్కర స్థాయిలు పెరుగుతాయని అందరికీ తెలుసు.. అసలు రక్తంలో చెక్కర స్థాయిలు పెరగడం తగ్గడం ఎవరి చేతుల్లో ఉంటుంది..? అంటే దీన్ని కంట్రోల్‌ చేసేది ఇన్సులిన్‌. ఎవరి రక్తంలో అయితే ఇన్సులిన్‌ స్థాయిలు తక్కువగా ఉంటాయో.. వారి రక్తంతో చెక్కర స్థాయిలు అదుపులో ఉండవు అన్నట్లు. అందుకే షుగర్‌ మరీ ఎక్కువైతే.. ఇన్సులిన్‌ ఇంజక్షన్స్‌ కూడా వాడతారు. అయితే మన శరీరంలో ఈ ఇన్సులిన్ హార్మోన్‌ను ప్రాంకియాస్ గ్రంథి ఉత్ప‌త్తి చేస్తుంది. ప్రాంకియాస్ గ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్ప‌త్తి చేసే క‌ణాల‌ను బీటా క‌ణాలు అంటారు. ఈ బీటా క‌ణాలు దెబ్బ‌తింటే ఇన్సులిన్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. అంటే ఒక దానికి ఒక కనక్షన్‌ ఉంటుంది చూడండి.. ఇన్సులిన్ నాణ్య‌త కూడా త‌గ్గుతుంది. ఈ బీటా క‌ణాలు మ‌న శ‌రీరంలో ఉండే ఫ్రీరాడిక‌ల్స్ కార‌ణంగా దెబ్బ‌తింటాయి. బీటా క‌ణాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల మ‌నం షుగ‌ర్ వ్యాధితో పాటు ఇత‌ర ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. సో.. ప్రాబ్లమ్‌ ఎక్కడ నుంచి స్టాట్‌ అయిందో చూశారా..?

బీటా క‌ణాల‌ను, ప్రాంకియాస్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుకుంటే.. షుగర్‌ వ్యాధి బారిన పడం అనమాట. ప్రాకింయాస్ గ్రంథిలో ఉండే బీటా క‌ణాల‌ను డీటాక్సిఫై చేసి ఫ్రీరాడికల్స్‌ను నాశ‌నం చేయ‌డంలో మ‌న‌కు ఆంబిడిన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నం వాయువిదంగాల్లో ఉంటుంది. వాయువిదంగాలు మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో ల‌భిస్తాయి. అలాగే వీటి పొడి కూడా మ‌న‌కు దొరుకుతుంది. ఈ పొడిని పూట‌కు 5 గ్రాముల మోతాదులో ఒక గ్లాస్ నీటిలో క‌లిపి రెండు పూట‌లా తీసుకోవ‌డం వ‌ల్ల ఫ్రీరాడిక‌ల్స్ న‌శిస్తాయి.
దీంతో బీటా క‌ణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్రాంకియాస్ గ్రంథిలో ఫ్రీరాడిక‌ల్స్ ఉ్త‌త్ప‌త్తి కాకుండా ఉంటాయ‌ని నిపుణులు అంటున్నారు. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల బీటాక‌ణాల‌కు, ప్రాంకియాస్ గ్రంథికి ఇన్ ప్లామేష‌న్ రాకుండా ఆరోగ్యంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు అలాగే భ‌విష్య‌త్తులో షుగ‌ర్ స‌మ‌స్య బారిన ప‌డ‌కుండా ఉండాల‌నుకునే వారు ఈ వాయు విదంగాల పొడిని తీసుకోవ‌డం వల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.
మీకు ఇది ఒక్కసారి చదవగానే అర్థంకాకపోవచ్చు.. మళ్లీ ఒకసారి మెల్లగా చదవండి.. షుగర్‌ వ్యాధి ఎక్కడ నుంచి స్టాట్‌ అవుతుంది, దేనివల్ల వస్తుందో.. అక్కడ మనం సమస్యను పరిష్కరిస్తే..షుగర్‌ను కంట్రోల్‌ చేసినవాళ్లం అవుతాం.. షుగర్‌ లేనివారు కూడా భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే.. ఈ పొడిని వాడొచ్చు! వైద్యుల సలహా మేరకు ఈ వాయు విదంగాల పొడిని వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.