Sweets : ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీపి పదార్థాలు తీసుకోకూడదు అంటే!

Sweets  కనిపిస్తే ఎవరూ తినకుండా ఉండలేరు. అందులో ఉన్న తీయదనం అలాంటిది అని చెప్పవచ్చు. అయితే అందరి శరీర తత్వానికి స్వీట్స్ సరిపడవని చెప్పవచ్చు. ముఖ్యంగా అసలు స్వీట్స్ ఎవరు తినకూడదు ఒకసారి చూద్దాం.

Sweets : ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీపి పదార్థాలు తీసుకోకూడదు అంటే!
diabetics


Sweets  కనిపిస్తే ఎవరూ తినకుండా ఉండలేరు. అందులో ఉన్న తీయదనం అలాంటిది అని చెప్పవచ్చు. అయితే అందరి శరీర తత్వానికి స్వీట్స్ సరిపడవని చెప్పవచ్చు. ముఖ్యంగా అసలు స్వీట్స్ ఎవరు తినకూడదు ఒకసారి చూద్దాం.

ఎదురుగా స్వీట్స్ కనిపిస్తున్న తినకుండా ఉండాలి అంటే చాలా కష్టమైన పనే. అయినప్పటికీ కొన్నిసార్లు మనసుని అదుపులో పెట్టుకోక తప్పదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వీట్స్ ను తీసుకోకూడదు.

స్వీట్స్ ఎవరు తినకూడదంటే..

సాధారణంగా మధుమేహం సమస్య ఉన్నవారు స్వీట్స్ తీసుకోకూడదు దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. రక్తపోటు, శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు తీపి పదార్థాలను తీసుకోకూడదు. అలాగే జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, చాలా కాలం నుంచి అజీర్తి సమస్య వేధిస్తున్నవారు, కడుపు ఉబ్బరంగా ఉండేవారు స్వీట్స్ ను తగ్గించాలి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా ఉండని వాళ్ళు సైతం స్వీట్స్ ను తీసుకోకూడదు.

స్వీట్స్ ను అధికంగా తినటం వల్ల బరువు పెరగటం, బద్దకం ఆవహించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణశక్తి తగ్గడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు వికారంగా అనిపించడంతో పాటు మూత్రానికి సంబంధించిన వ్యాధులు సైతం వచ్చే అవకాశం ఉంది.

అయితే మరి తీపి తినకుండా ఉండలేని వారు బెల్లంతో చేసిన పదార్థాలను మితంగా తీసుకోవచ్చని తెలుస్తోంది. తక్కువ మోతాదులో తేనెను కూడా తీసుకోవచ్చు. మినప్పప్పు తో చేసే పంచదార సున్నుండలు శుక్ర వృద్దిని పెంచుతాయని తెలుస్తోంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.