ఇప్పుడు షుగర్‌ లెవల్స్‌ మారాయి తెలుసా? మరి ఆ లెవల్స్‌ ఏంటో చూద్దామా...

ఇప్పుడున్న పరిస్థితుల్లో షుగర్‌ పెషేంట్‌ లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. అవును అది నిజమే. ఎందుకంటే పరిస్థితులు అలా మారిపోయాయి. టైప్‌-2 డయాబెటిక్‌నే షుగర్‌ అంటాం. ఫాస్టింగ్‌ చేసి షుగర్‌ టెస్ట్‌

ఇప్పుడు షుగర్‌ లెవల్స్‌ మారాయి తెలుసా? మరి ఆ లెవల్స్‌ ఏంటో చూద్దామా...


ఇప్పుడున్న పరిస్థితుల్లో షుగర్‌ పెషేంట్‌ లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. అవును అది నిజమే. ఎందుకంటే పరిస్థితులు అలా మారిపోయాయి. టైప్‌-2 డయాబెటిక్‌నే షుగర్‌ అంటాం. ఫాస్టింగ్‌ చేసి షుగర్‌ టెస్ట్‌ చేయించుకుంటే....ఉందో లేదో తెలుస్తుంది. ఊబకాయం ఉంటే కచ్చితంగా డయాబెటిక్‌ ఉన్నట్లే. సాధారణంగా 110 తక్కువ ఉంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంకా ఎక్కువ వస్తే....అప్పుడు ఆలోచించాలి. అయితే రాత్రి లేటుగా తిని పొద్దున్నే ఏం తినకుండా టెస్టులు చేయించుకుంటే మాత్రం 130, 140 కనిపిస్తుంది. అయినా భయపడాల్సిన పని లేదు. కాబట్టి కచ్చితంగా రాత్రి 8, 9 కల్లా తినేయాలి. ఇంకా తర్వాత నీళ్లు మాత్రమే తాగాలి. మరుసటి ఏం తినకుండా టెస్టులు చేయించుకుంటే సరైన రీడింగ్‌ వస్తుంది. టీ, కాఫీలు కూడా తీసుకోకుండా శాంపిల్స్‌ చేసుకోవాలి.

తొలిసారి షుగర్‌ ఉందా లేదా తెలుసుకోవాలంటే అప్పుడు చేయించుకోవల్సిన టెస్ట్‌ ఏంటంటే....hb1ac టెస్టు.

hb1ac టెస్ట్ 5.8 కంటే తక్కువ ఉంటే డయాబెటిక్‌ లేనట్లు, దాన్ని దాటి 5.8 నుంచి  6.4 ఉంటే ప్రీ డయాబెటిక్‌ ఉందని అర్థం. ఒకసారి రీడింగ్‌ వస్తే షుగర్‌ వచ్చిందనుకోవక్కర్లేదు. అలా ఒక 6 నెలలు పరీక్షలు చేయించుకున్నా కూడా ఇదే రీడింగ్‌ వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా 6.4 కన్నా ఎక్కువగా ఉంటే....డయాబెటిక్‌ లోకి వెళ్తున్నట్లు అర్థం.

అయితే ఇప్పుడు నిపుణులు ఏం చేప్తున్నారంటే 7 నుంచి 8 స్థాయిలో hb1ac టెస్టులో కనపడినా భయపడక్కర్లేదు. 8 లోపు hb1ac ఉందంటే ఆహార నియమాలు మార్చుకోవాలి. వెంటనే వ్యాయామం అవసరం లేదు. యోగా కూడా అక్కర్లేదు. ఫుడ్‌ చేంజ్‌ చేస్తే సరిపోతుంది. జీవనవిధానం మార్చుకోవాలి.

కాబట్టి మొదట వచ్చిన రీడింగ్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవక్కర్లేదు. అప్పుడే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వెయిట్‌ పెరిగినా, కొవ్వు పెరిగినా....ఇన్సులిన్‌ పెరిగిపోతుంది. ఇంకా దానితో పాటు షుగర్‌ స్థాయిలు కూడా పెరిగిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే భారీగా షుగర్‌ ఉండే పదార్థాలు తీసుకోకూడదు. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసుకోవాలి. డైట్‌లో మార్పులు చేసుకోవాలి. దానివల్ల మొదట వచ్చిన రీడింగ్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. అందుకే మొదట రీడింగ్‌ రాగానే నేను డయాబెటిక్‌ అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అయితే షుగర్‌ లెవల్స్‌ టెస్ట్‌లు చేయించుకునేటప్పుడు పరగడుపున చేయించుకోవాలి. 12, 13 గంటలు ఏం తినకూడదు. పరీక్ష చేయించుకునే ముందురోజు రాత్రి 8 కల్లా తినేయాలి. కానీ ఈ రోజుల్లో ఎవరూ రాత్రి 8, 9 కల్లా తినడం లేదు. అర్థరాత్రి బిర్యానీలు, పార్టీలకు అలవాటు పడిపోయారు. పెద్ద పెద్ద హోటల్స్‌ కూడా మిడ్‌నైట్‌ బిర్యానీని ప్రమోట్‌ చేస్తున్నారు. అలాంటి సంస్కృతి ఎప్పటికీ మంచిది కాదు. ఇదే గనుక కొనసాగితే మాత్రం భవిష్యత్‌ తరం ప్రశ్నార్థకంగా మారుతుంది. అప్పుట్లో మనిషి ఆయుర్దాయం 90 నుంచి 100 ఏళ్లు ఉండేది. రాను రాను మనిషి ఆయుర్దాయం తగ్గిపోతోంది. ఇప్పుడు కూడా మనం ఇంకా మేల్కోకపోతే....రాబోయే తరం ఇక జీవితాన్ని కూడా చూడలేవు.

 ఈ మధ్య గుండెపోటులు బాగా పెరిగిపోయాయి. జీవితం పావు వంతు కూడా లేని యువత.... గుండెపోటుకు బలైపోతున్నారు. అందుకే రాత్రి పూట బాగా తినేసి మరుసటి రోజు పరీక్షలకు వెళ్తే మాత్రం షుగర్‌ రీడింగ్‌ ఎక్కువగానే చూపిస్తుంది. దాన్ని ఆధారంగా మందులు తీసుకోవడం సేఫ్‌ కాదు. క్రమంగా టెస్టులు చేయించుకోవాలి. మొదట వచ్చిందనిపించగానే జీవనవిధానంలో మార్పులు చేసుకుంటే తగ్గించుకోవచ్చు. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.