Sleep Position effects : ఆ పొజిషన్ లో నిద్రపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయట.. !

Sleep Position effects : ఎంతటి అలసటనైనా తీర్చే ఒకే ఒక మార్గం నిద్ర.. నిద్రలో ఎన్నో బాధలు మరిచిపోవచ్చని.. ప్రశాంతంగా నిద్రపోతే శారీరిక అలసటతో పాటూ..  మానసిక అలసట సైతం దూరం అవుతుందని

Sleep Position effects : ఆ పొజిషన్ లో నిద్రపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయట.. !
Sleep Position effects


Sleep Position effects : ఎంతటి అలసటనైనా తీర్చే ఒకే ఒక మార్గం నిద్ర.. నిద్రలో ఎన్నో బాధలు మరిచిపోవచ్చని.. ప్రశాంతంగా నిద్రపోతే శారీరిక అలసటతో పాటూ..  మానసిక అలసట సైతం దూరం అవుతుందని తెలుస్తుంది. అయితే ఈ నిద్రపోయే విషయంలో కొందరు తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పడుకొనే పొజిషన్ నిద్ర పోయినప్పుడు చాలా ముఖ్యమని తెలుస్తుంది..

నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పొజిషన్లో నిద్రపోతారు.. అయితే కొన్ని రకాల పొజిషన్లో పడుకున్నప్పుడు వెన్నుముకపై భారం పడి పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తోంది.. ముఖ్యంగా వెలికిలా, పక్క కు తిరిగి పడుకున్నా వచ్చే సమస్యలు కన్నా.. బోర్లా తిరిగి పడుకుంటే వచ్చే సమస్యలు ఎక్కువ అని తెలుస్తోంది..

బోర్లా తిరిగి నిద్రపోవడం వల్ల కడుపు భాగంలో ఎక్కువ ఒత్తిడి పడుతుంది.. దీనివలన పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇలా నిద్రపోయే అలవాటు ఉన్న వారికి సక్రమంగా నిద్రపోతున్నట్టు అనిపించినప్పటికీ.. సరిగ్గా నిద్ర పట్టదని తాజా అధ్యయనాల్లో తేలింది.. అలాగే ఇలా నిద్రపోయినప్పుడు వెన్ను ముక, వీపు, మెడ భాగాలు సరైన స్థితిలో ఉండవని తెలుస్తుంది..

దీని వల్ల దీర్ఘకాలంగా విపరీతమైన వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.. అలాగే బోర్లా పడుకోవడం వల్ల లాంబర్డో పాయింట్ మీద భారం పడి నొప్పి రావడమే కాకుండా..  డిస్క్ సమస్యలు కూడా  వస్తాయంట.. అలాగే ఈ పొజిషన్ లో పడుకోవడం వల్ల హెర్నియా డిస్క్ అనే సమస్య కూడా వస్తుందట దీంతో వెన్నెముకలో పగుళ్ళు ఏర్పడి జిగురు తగ్గుతుందట.

అలాగే బోర్లా తిరిగి పడుకున్నప్పుడు ఏదో ఒక వైపుకు మాత్రమే మెడభాగాన్ని ఉంచుతాం.. దీనివలన విపరీతంగా మెడ నొప్పి, మెడ పట్టేయడం వంటి సమస్యలు ఎదురౌతాయి.. 

మెడ నుంచి వెన్నెముకకు ఉండే సంబంధం సైతం ఒత్తిడి పడి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తుంది.. 
అలాగే వీటి వలన దీర్ఘకాలం వేధించే నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.. అలాగే ముఖ్యంగా అమ్మాయిలు ఇదే విధంగా నిద్రపోవడం అలవాటు చేసుకుంటే వారు దీర్ఘకాలం మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఇది ఎంతో ఇబ్బందిని కలిగిస్తుందని.. అందుకే వెల్లకిలా కానీ, ఒక వైపు కానీ తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల చాలా మంచిదని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.