Amla : ఎన్నిసార్లు చెప్పినా ఉసిరిని మర్చిపోతున్నారా..  ఆరోగ్యమైన జీవితానికి ఉసిరి చేసే మేలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. 

Amla తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు చర్మాన్ని నేర్పించడంలో జుట్టుని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం Amla.

Amla : ఎన్నిసార్లు చెప్పినా ఉసిరిని మర్చిపోతున్నారా..  ఆరోగ్యమైన జీవితానికి ఉసిరి చేసే మేలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. 
know the benefits of amla for a healthy life


Amla తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు చర్మాన్ని నేర్పించడంలో జుట్టుని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం Amla.
మన చుట్టూ ఉండి మన చుట్టూనే పెరుగుతున్న ఎన్నో రకాల మొక్కలు, పళ్ళు, కాయగూరల విలువ మనకి చాలా వరకు తెలియదు. ముఖ్యంగా భారతీయ వంటకాలలో ఉపయోగించే ప్రతి ఒక్క పదార్థం ఎంతో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తరతరాలుగా ఎంతో ఆలోచించి ఎన్నో వ్యాధులు నయం చేసే వస్తువులనే మనం రోజు వంటకాల్లో ఉపయోగించే విధంగా నేర్పించింది. మన భారతీయ సంస్కృతిలో ఉసిరిని కూడా ఎన్నో విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. ఉసిరి పచ్చళ్ళు చేయడం ఊరబెట్టి తినటం నేరుగా తీసుకోవడం వంటివి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
అన్నిటికన్నా ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యం బాలేనీ పరిస్థితిలో సైతం ఉసిరిని తీసుకోవడం వల్ల చేదుగా అనిపించిన నాలుక రుచిగా అనిపిస్తుంది. ఆకలి వేయకపోవటాన్ని కడుపులో ఉండే పుండ్లని తగ్గిస్తుంది. అలాగే ఎముకలు, గుండె వంటి వాటికీ కూడా ఉసిరి ఎంతో మంచిది. పళ్లకి సంబంధించిన సమస్యలు సైతం దూరం చేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరాన్ని ఒక చక్కని రీతిలో నిర్మించుకోవడానికి ఉసిరి ప్రధానం.

ఉసిరిని తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించబడతాయి. అలాగే నరాలకి కూడా ఇది ఎంతో మంచిది. కామెర్లు వంటి వ్యాధులు సైతం ఉసిరితో తగ్గిపోతాయి. రోజు ఉసిరికాయ తింటే మొలల సమస్య దరిచేరదు.
కేశ సౌందర్యం లో ఉసిరిని ఉపయోగిస్తూ ఉంటాము. ఉసిరిని తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడటం తగ్గి కురులు సక్రమంగా పెరుగుతాయి. ఎండించిన ఉసిరినీ కొబ్బరి నూనెలో వేసి మరిగించి దానిని మాడుకు రాయడం వల్ల శిరోజాలు చక్కగా పెరుగుతాయి.
వృద్ధాప్య సమస్యలను సైతం ఉసిరి తగ్గిస్తుంది. ఉసిరిని తరచు తీసుకోవడం వల్ల శరీరం ముడతలు పడకుండా ఉంటుంది. నీరసం, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. శ్వాస వ్యాధులకు సైతం మంచి పరిష్కారం. దగ్గు, ఆస్తమా ఉన్నవారు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
పిల్లలకు ఉసిరికాయను తినిపించడం వల్ల ఆకలి పెరుగుతుంది. కంటి చూపు సైతం మెరుగుపడుతుంది.
దంతాల సమస్యలు చిగుళ్ళ నుంచి రక్తం రావడం లాంటి వాటిని ఉసిరి అదుపులో ఉంచుతుంది
స్త్రీ సంబంధిత సమస్యల్ని దూరం చేయడంలో కూడా ఉసిరి ముందు ఉంటుంది. ఉసిరి తేనె పటిక బెల్లం కలిపి తీసుకుంటే స్త్రీలలో అయ్యే వైట్ డిస్చార్జ్ అదుపులో ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.