గ్యాస్ ట్రబుల్ సమస్య ఎలా అదుపు చేయాలంటే.. ! 

కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవటం వల్ల Gas trouble problem వస్తుంది. అయితే ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

గ్యాస్ ట్రబుల్ సమస్య ఎలా అదుపు చేయాలంటే.. ! 
control Gastric problems


గ్యాస్ ట్రబుల్ వస్తే ఎప్పుడూ కడుపులో అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఉబ్బరంగా ఉండి ఏ పని మీద ఏకాగ్రత కుదరదు.. ఇలాంటి వాళ్లు ఆహారాన్ని సైతం సరిగా తీసుకోలేరు.. అలాగే తినే పదార్థాల విషయంలో నియంత్రణ కూడా పాటించాల్సి వస్తుంది. ఉప్పు, కారం వంటి వాటిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. అయితే ఇలాంటి గ్యాస్ సమస్యను ఎలా అదుపు చేయాలి అంటే.. 

కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవటం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. అయితే ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అంతేకాకుండా మారిపోతున్న జీవన శైలి, షిఫ్ట్ లలో పనిచేయటాలు, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవటం, వేళకు నిద్రపోకపోవడం, అతిగా ఆలోచించడం, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవటం వంటి ఎన్నో కారణాలు ఉంటూ ఉంటాయి. ఆహారాన్ని తిన్నప్పుడు పూర్తిగా నమలి మింగాలి. అలాగే చాలా మందికి తిన్నప్పుడు నీరు తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల కూడా ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.. 

ఒకసారి గ్యాస్ సమస్య వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.. అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య అదుపులో ఉంటుందని తెలుస్తోంది..

అందులో ముఖ్యంగా అల్లం కడుపులో గ్యాస్ ను నియంత్రిస్తుందని.. రోజు చిన్న అల్లం ముక్కను నమలటం వల్ల ఈ సమస్య అదుపులో ఉంటుందనీ తెలుస్తుంది..

రోజు కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు అదుపులో ఉంటాయి.. భోజనానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గుతుంది..

అలాగే వాము, ఏలకులు, మిరియాలు, శొంఠి వంటివి కలిపి మరిగించిన నీటిని తాగడం వల్ల గ్యాస్ సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది..

అలాగే శొంఠిని పొడి చేసి భోజనానికి అరగంట ముందు నీటిలో కలిపి తాగడం వల్ల ఈ సమస్య అదుపులో ఉంటుంది..

తులసి ఆకులను న‌మ్ల‌డం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే పుదీనా ఆకులను మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.