వెదురు బియ్యం.. తిన్నారంటే ఆ రోగాలన్నీ మాయం..! 

ఆరోగ్యంగా ఉండేందుకు జనాలు తినే బియ్యాన్ని మార్చేశారు. బ్రౌన్‌ రైస్‌, బ్లాక్‌ రైస్‌, బొంబా రైస్‌, జాస్మిన్‌ రైస్‌ అంటూ ఏవేవో తింటున్నారు.. ఇవి అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ మీరు వెదురు చెట్ల బియ్యం గురించి విన్నారా..?

వెదురు బియ్యం.. తిన్నారంటే ఆ రోగాలన్నీ మాయం..! 


ఆరోగ్యంగా ఉండేందుకు జనాలు తినే బియ్యాన్ని మార్చేశారు. బ్రౌన్‌ రైస్‌, బ్లాక్‌ రైస్‌, బొంబా రైస్‌, జాస్మిన్‌ రైస్‌ అంటూ ఏవేవో తింటున్నారు.. ఇవి అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ మీరు వెదురు చెట్ల బియ్యం గురించి విన్నారా..? ఏంటి వెదురు చెట్లకు బియ్యం వస్తుందా అని షాక్‌ అవతున్నారా..?సాధారణ వరి మాదిరిగానే వెదురు చెట్లకు పూతపడుతుంది. ఆ తర్వాత కంకులు పడతాయి. వెదురు మొక్క సాధారణంగా పూయదు. ఒకవేళ పూసినా ఏ వందేళ్లకో పూస్తుంది. అడవుల్లో ఉండే గిరిజనులు కూడా తమ జీవితంలో ఎప్పుడూ వెదురుపూతను చూసి ఉండరట. కొన్ని వెదురు జాతులు మాత్రం 50 సంవత్సరాలకు ఒకసారి పూస్తుంటాయి. పూతపూశాక వెదురు బియ్యం కంకులు వచ్చాయంటే.. అది చనిపోయే సమయం ఆసన్నమైందని అర్థం..

Bamboo Rice: Everything You Need To Know - Moolihai.com

జీవితకాలంలో వెదురు చెట్లు ఒకే ఒక్కసారి పూస్తాయన్నమాట. వెదురు బియ్యంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి తిన్నవారిలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గుతుంది. విటమిన్‌ బీ6, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, పీచు ఈ బియ్యంగా ఎక్కువగా ఉంటాయి. మధుమేహాన్ని, బీపీని నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది. కీళ్ల నొప్పులను చక్కటి ఉపశమనం కలుగుతుంది. వెదురు బియ్యాన్నే కాదు వెదురు పిలకను కూడా ఆహారంగా తీసుకోవచ్చు..

వెదురు పిలకలను ఎలా వాడతారంటే..

వెదురు పిలకలను ఉడికించి వంటల్లో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు రోజులపాటు నీటిలో నానబెట్టి తర్వాత పచ్చడి కూడా చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పులియబెట్టి వాడుతుంటారు. వెదురు పిలకలు శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి..వీటిలో పిండిపదార్థాలు, ప్రోటీన్లతోపాటు కాపర్‌, ఐరన్‌, ఫాస్పరస్‌, పొటాషియం వంటి మూలకాలు, రైబోఫ్లెవిన్‌, విటమిన్‌ ఏ, కే, ఈ, బీ6 పుష్కలంగా ఉంటాయి.  

వెదురు పిలకల వల్ల ఉపయోగాలు..

వీటిలో లభించే ఫైటోప్టెరాల్స్‌, ఫైటోన్యూట్రియంట్స్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి.
ఈ పిలకల్లో క్యాలరీలు చాలా తక్కువగా, పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరం బరువును ఇట్టే తగ్గిస్తాయి. 
వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 
నాడీసంబంధ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. 
గర్భిణీలు వీటిని తినడం వల్ల గర్భాశయం సంకోచం చెంది కాన్పు తేలికవుతుందని నిపుణులు చెప్తుంటారు. 
మధుమేహం, డిప్రెషన్‌, ఊబకాయం తగ్గడానికి వెదురు పిలకలు దోహదపడుతుంటాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.