Cough : తరచూ దగ్గు వస్తుందా.. ఆపకుండా వేధిస్తుందా.. ఇలా జాగ్రత్త పడండి!

కొందరిని  Cough  వేధిస్తూ ఉంటుంది. కారణం లేకుండానే విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆగకుండా దగ్గు వస్తుంది. అలాగే మాట్లాడిన, నిద్రపోయినా కూడా దగ్గు ఆగదు

Cough : తరచూ దగ్గు వస్తుందా.. ఆపకుండా వేధిస్తుందా.. ఇలా జాగ్రత్త పడండి!
Cough


కొందరిని  Cough  వేధిస్తూ ఉంటుంది. కారణం లేకుండానే విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆగకుండా దగ్గు వస్తుంది. అలాగే మాట్లాడిన, నిద్రపోయినా కూడా దగ్గు ఆగదు. దీనివలన తలతో పాటు కడుపులో సైతం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ దగ్గు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

సాధారణంగా దగ్గు రావడానికి ఒక్కటే సమస్య అని చెప్పలేము. గొంతు నుండి ఊపరితిత్తుల వరకు కలిపి మొత్తం ఉండే శ్వాస వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరిగినా దగ్గు సమస్య వేధించే అవకాశం ఉంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఆపకుండా వచ్చే పొడి దగ్గు, కోరింత దగ్గు, కఫం వల్ల కలిగే దగ్గు వంటివి ఎన్నో ఉన్నాయి. కొందరిలో తీవ్రంగా దగ్గు మొదలై నొప్పితో కూడిన ఆయాసం సైతం వచ్చే అవకాశం ఉంది.

దగ్గుకి ప్రధాన కారణాలు ఏంటంటే..

దగ్గుకి ప్రధాన కారణాలు.. ఈ రోజుల్లో కాలుష్యం అనే చెప్పాలి. బయట తిరిగినప్పుడు మాస్క్ పెట్టుకోకపోవడం, స్కార్ఫ్ కట్టుకోకపోవడం వంటి వాటి వల్ల శ్వాస వ్యవస్థలోకి ఈ కాలుష్యం చేరి దగ్గు ఎలర్జీ వంటి వాటిని కలిగిస్తుంది. అలాగే ఎక్కువ కాలం నిలువ ఉండిపోయిన నీరు, బయట దొరికే సాఫ్ట్ డ్రింకులు వంటివి తీసుకోవడం వల్ల కూడా దగ్గు సమస్య వేధిస్తూ ఉంటుంది..

ఎలా తగ్గించుకోవాలంటే..

అతిగా చల్లగా ఉండే తీపిగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు. అలాగే సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటే మానుకోవాలి. ఎక్కువకాలం నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు. చాక్లెట్లు, బిస్కెట్లు వంటి వాటిని తీసుకోవడం మానేయాలి. బయట దొరికే జ్యూస్లు, ఐస్ క్రీమ్లు వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.

ఇంట్లో దగ్గును ఎలా తగ్గించుకోవాలంటే..

సాధారణంగా అల్లం రసంలో కొంచెం తేనె కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే దగ్గు సమస్య తొలగిపోతుంది. కరక్కాయను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని పిలుస్తూ ఉన్నా కూడా దగ్గు సమస్య వేధించడం తగ్గుతుంది. అప్పుడు తగ్గినప్పుడు రెండు మూడు తులసి ఆకులని కరక్కాయతో కలిపి బుగ్గన ఉంచుకొని ఆ రసాన్ని పిలిస్తే తగ్గే అవకాశం ఉంటుంది లవంగం మొగ్గని కాల్చి తేనెలో రంగరించి తీసుకున్న దగ్గు తగ్గిపోతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.