కడుపునొప్పిని వెంటనే తగ్గించే సూపర్ చిట్కాలు..ఒక్కసారి వాడితే అశ్చర్యపోతారు..

కడుపునొప్పి కూడా తట్టుకోవడం చాలా కష్టం.. కడుపునొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి..ఇన్ఫెక్షన్స్, అతిగా తినడం, ఒకేసారి ఎక్కువగా నీటిని తాగడం, వాతావరణంలో మార్పులు, ఫుడ్ పాయిజన్, బ్యాక్టీరియా కలిగిన నీటిని తాగడం, అజీర్తి వంటి వివిధ కారణాల చేత కడుపు నొప్పి వస్తూ ఉంటుంది.

కడుపునొప్పిని వెంటనే తగ్గించే సూపర్ చిట్కాలు..ఒక్కసారి వాడితే అశ్చర్యపోతారు..


కడుపునొప్పి కూడా తట్టుకోవడం చాలా కష్టం.. కడుపునొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి..ఇన్ఫెక్షన్స్, అతిగా తినడం, ఒకేసారి ఎక్కువగా నీటిని తాగడం, వాతావరణంలో మార్పులు, ఫుడ్ పాయిజన్, బ్యాక్టీరియా కలిగిన నీటిని తాగడం, అజీర్తి వంటి వివిధ కారణాల చేత కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే నేటి తరుణంలో రసాయనాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. కడుపు నొప్పి వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సమస్య తలెత్తగానే మనలో చాలా మంది మందులను వాడుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్ ను తగ్గించే యాంటీ బయాటిక్స్ ను వాడుతూ ఉంటారు. కడుపు నొప్పి రాగానే మందులు వాడే అవసరం లేకుండా ఇంట్లోనే కొన్ని రకాల పానీయాలను తయారు చేసుకుని తాగడం మంచిది.. ఇంట్లో దొరికే వాటితో కడుపు నొప్పి తగ్గే పానీయాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Stomach Pain — Know When to Go to the ER
కడుపు నొప్పిని తగ్గించడంలో లెమన్ టీ మనకు ఎంతగానో సహాయపడుతుంది. అజీర్తిని తగ్గించడంలో, కడుపు నొప్పిని తగ్గించడంలో, కడుపులో ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో లెమన్ టీ సహాయపడుతుంది. ఈ టీని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో 3 కప్పుల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో 4 లేదా 5 తులసి ఆకులు, 3 నిమ్మకాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ వాము వేసి ఈ నీటిని చిన్న మంటపై బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఆ తరువాత వడకట్టుకుని తాగాలి. ఇలా నిమ్మకాయ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది..
ఒక గిన్నెలో 2 కప్పుల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కను, కొన్ని మిరియాలను దంచి వేసుకోవాలి. తరువాత ఈ నీటిని మరిగించి వడకట్టుని గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తేనెను కలిపి తాగాలి. ఇలా అల్లం టీ ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, తల తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపులో నొప్పి ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో పెరుగు చక్కగా పని చేస్తుంది. దీని కోసం ఒక కప్పు పెరుగును తీసుకోవాలి..ఇందులో జిలకర్ర, నల్ల ఉప్పు వేసి, పెరుగును కలిపి తీసుకోవడం ద్వారా వెంటనే కడుపు నొప్పి తగ్గుతుంది..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.