ముఖంపై మచ్చలు పోవాలన్నా.. స్పీడ్‌గా బరువు తగ్గాలన్నా.. గ్రీన్ బీన్స్‌ని ట్రై చేసేయండి.।!
ఎక్కుమందికి స్కిన్ బాగా సెన్సిటివ్ అయి పిగ్మెంటేషన్ తరచు వచ్చి ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు గ్రీన్ బీన్స్ బాగా హెల్ప్ చేస్తుంది. ఒబిసిటీ, షుగర్ ఉన్నవారు బరువు , ఘగర్ కూడా పెరగకుండా ఉంటుంది.

మనకు ప్రకృతి అందించిన అనేక కూరగాయాల్లో ఎక్కువ మంది బాగా ఇష్టపడుతూ, దొరికినప్పుడల్లా బాగా వాడే వెజిటబుల్‌లో ఒకటి గ్రీన్ బీన్స్. దీన్నే ఫ్రెంచ్ బీన్స్ అని కూడా అంటుంటారు. ఈ బీన్స్‌ని పలావుల్లో, బిర్యానీల్లో, ఫ్రైడ్ రైస్‌లోనూ, ఫ్రైలోనూ వాడుతుంటారు. సూప్స్‌లో కూడా బీన్స్ వేస్తారు. అయితే ఈరోజు అసలు ఈ బీన్స్‌లో ఏం ఏం పోషకాలు ఉంటాయి. సైంటిఫిక్‌గా ఏం ఏం లాభాలు మనం పొందవచ్చు అనేది విపులంగా చూద్దాం.
100 గ్రాముల గ్రీన్ బీన్స్‌లో ఉండే పోషకాలు
- నీటి శాతం 92 గ్రాములు ఉంటుంది.
- నీటి శాతం ఎక్కువగా ఉండేసరికి శక్తి తక్కువగా ఉంటుంది. కేవలం 28 కేలరీలు మాత్రమే ఉంటుంది.
- ప్రోటీన్ 1.5 గ్రాములు
- ఫ్యాట్ 0.3 గ్రాములు.. అంటే లేనట్లే.
- పీచుపదార్థాలు 3 గ్రాములు. ఇదంతా సాలిబుల్ ఫైబర్..శరీరానికి చాలా మంచిది.
- పొటాషియం 211 మిల్లీ గ్రాములు
ఇవన్నీ గ్రీన్ బీన్స్‌లో లభించే పోషకాలు.
కొంతమందికి ఫైబర్ ఉండే ఆహారాలు పడవు. పీచుపదార్థాలు ఉన్న ఆహారం తింటే ప్రేగుల్లోకి వచ్చి సమస్యలు వస్తాయి. అల్సరేటీవ్ కొలిటీస్ (Ulcerative colitis) ఐబీస్ సమస్య ఉన్నవారికి(Irritable bowel syndroms IBS) క్రాన్స్ డిసీస్ ఉన్నవారికి( Crohn's Disease) లూస్ మోషన్స్ ఎక్కువయ్యేవారికి వైద్యులు కూడా ఫైబర్ ఉన్న ఆహారం తినొద్దు అంటారు. కానీ ఈ గ్రీన్ బీన్స్‌లో ఉండేది ఫైబర్ సాలిబుల్ కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తినొచ్చు అని సైంటిఫిక్‌గా నిరూపించారు.
ఎండతగలితే ఆ సూర్యకిరణాల్లో ఉండే యూవీరేసెస్ ఎండవల్ల మొఖం మీద పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. ఇలా పిగ్మెంటేషన్ రాకుండా గ్రీన్ బీన్స్ బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్ స్టడీ చెప్తుంది. సూర్యకిరణాల్లో ఉండే యూవీరేసెస్ మన చర్మంమీద పడ్డప్పుడు లోపల ఉండే మెలనోసైట్స్ అతిగా స్టిమ్యూలేట్ చేసి ఎక్కువ నలుపు వర్ణం ఉత్పత్తి అవుతుంది. దానివల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. ఈ గ్రీన్ బీన్స్ తినటం వల్ల ఇందులో ఉన్న కెమికల్ కాంపౌండ్ హైడ్రాక్సిడ్ సినమిక్ యాసిడ్( Hydroxycinamic acid) అనేది కొలాజన్‌ను పెంచి అల్ట్రావైలెట్‌రేస్ వల్ల జరిగే డామేజ్‌ను స్కిన్‌సెల్స్ నుంచి రక్షించి పిగ్మెంటేషన్ రాకుండా గ్రీన్ బీన్స్ బాగా కాపాడుతాయని, 1974 యూఎస్ డిపార్టమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ యూస్‌ఏ వారు పరిశోధన చేసి నిరూపించారు. గ్రీన్ బీన్స్‌కి సన్‌రైజెస్ వల్ల వచ్చే డామేజ్‌ను కంట్రోల్ చేసే గుణం ఉంది అని వీళ్లు కనుగొన్నారు.
ఈరోజుల్లో ఎక్కుమందికి స్కిన్ బాగా సెన్సిటివ్ అయి పిగ్మెంటేషన్ తరచు వచ్చి ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు గ్రీన్ బీన్స్ బాగా హెల్ప్ చేస్తుంది.
ఇందులో ఉండే అతిముఖ్యమైన లాభం ఇంకోటి ఏంటంటే? 54రకాల పైటో కెమికల్స్ ( Phytochemicals) ఇందులో ఉన్నాయట. ఇవి మన కణజాలం జబ్బునబారినపడుకుండా రక్షించే యాంటీఆక్సిడెంట్స్‌లా ఇవి పనికొస్తున్నాయి. మాములుగా మన శరీరంలోకి నూనెపదార్థాలు, మాడినవి, బాగా దేవేసినవి, అతిగా హీట్ చేసినవి తిన్నప్పుడు ప్రీ రాడికల్స్ ఎక్కువగా వెళ్లిపోతాయి. ఇవి మన శరీరంలో కణజాలు జబ్బుల భారినపడేట్లు చేస్తాయి. ఈ 54 రకాల పైటో కెమికల్స్ ఈ ప్రీ రాడికల్స్ మన శరీరాన్ని డామేజ్ చేయకుండా యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి రక్షిస్తాయి.
ఇందులో కేలరీస్ తక్కువగా ఉన్నాయి.. ఒబిసిటీ ఉన్నవారు, షుగర్ ఉన్నవారు కూడా తీసుకుంటూ ఉంటే బరువు పెరగకుండా, షుగర్ కూడా పెరగకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇన్నిరకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్‌లో దొరికినప్పుడల్లా తెచ్చుకుని వివిధ రకాల వంటల్లో వాడుకోవచ్చు. పచ్చి బఠానీలు వేస్తే ఉప్పులేని లోటు అసలు తెలియదు. అయితే గ్రీన్ బీన్స్‌ను ఎప్పుడు వండాలనుకున్నా పుల్లని మజ్జిగలో ఉడకపెట్టి ఆ మజ్జిగ అంత ఇరిగిపోతుంది. అప్పుడు బీన్స్‌లో ఉండే చప్పదనం పోతుంది చాలా టేస్టీగా ప్రైలు కానీ, కూరలు కానీ చేసుకోవచ్చు. కాబట్టి ఈసారి మార్కెట్‌లో గ్రీన్ బీన్స్ దొరికితే కొనటం మర్చిపోవద్దే..!
-Triveni Buskarowthu