Body Odour : శరీరం నుంచి వచ్చే చెడు వాసనని, చెమట ని అరికట్టాలంటే తమలపాకుతో ఇలా చేస్తే సరి!

Body Odour: సాధారణంగా ఏ శుభకార్యం జరిగినా తమలపాకును తాంబూలంలో భాగంగా ఇస్తారు. అయితే తమలపాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరంలో ఉండే ఎన్నో రకాల వ్యాధుల్ని నివారించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Body Odour : శరీరం నుంచి వచ్చే చెడు వాసనని, చెమట ని అరికట్టాలంటే తమలపాకుతో ఇలా చేస్తే సరి!


Body Odour : సాధారణంగా ఏ శుభకార్యం జరిగినా తమలపాకును తాంబూలంలో భాగంగా ఇస్తారు. అయితే తమలపాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరంలో ఉండే ఎన్నో రకాల వ్యాధుల్ని నివారించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తాంబూలంలో తమలపాకుని భాగంగా ఇస్తారు. అలాగే తిన్న వెంటనే కిల్లిలో యాలకులు, పోక చెక్క వంటివి కలిపి ఇవ్వటం వెనుక కూడా ఎంతో అర్థం ఉందని తెలుస్తోంది.

పురాతన కాలం నుంచి ఉన్న ఒక అలవాటు అన్నం తీసుకుని వెంటనే కిల్లి ఇస్తూ ఉంటారు. అయితే దీని వెనుక ఉన్న అసలు అర్థం సోంపు, చిరు కర్పూరం కలిపి తాంబూలం గా మార్చి అన్నం తిన్న వెంటనే ఇచ్చే కిల్లి జీర్ణ క్రియ అని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పండగలు, పర్వదినాల సమయంలో చేసే పిండి వంటలు వల్ల లోపించే అరుగుదలను ఇది నియంత్రిస్తుంది.
తమలపాకును తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మ‌లినాలు, క్రిములు బయటికి పోతాయి అని తెలుస్తోంది. అలాగే తమలపాకుని పోక చెక్కతో కలిపి తీసుకోవడం వల్ల మూత సంబంధిత వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. అలాగే పంటి నొప్పి చిగుళ్లలో వచ్చే కొన్ని వ్యాధులు సైతం నివారించడానికి సహాయపడుతుంది. నోటి దుర్వాసన అని అరికడుతుంది, అధిక చేమటను తొలగిస్తుంది.
నడుము నొప్పికి సైతం తమలపాకు మంచి మందుగా పనిచేస్తుంది. లేత ఆకులని నువ్వుల నూనెలో మర్తించి వాటిని నడుము పైన రాస్తూ ఉంటే నడుము నొప్పి తగ్గిపోతుంది. అలాగే తమలపాకులో కొద్దిగా జీలకర్ర, పోక చెక్క, యాలకులు, లవంగాలు కలిపి తీసుకుంటే ఎలాంటి కడపబ్బరం అయినా చిటికలో దూరమవుతుంది.
తలనొప్పి ఎక్కువగా వేధిస్తే తమలపాకును నూరి ఆ రసాన్ని మొదటి పైన రాస్తే ఉపశమనం ఉంటుంది. శరీరం ఎక్కువగా చెమట పట్టి దుర్వాసన వస్తుంటే రెండు కప్పుల నీళ్లలో ఐదు తమలపాకులు వేసి మరగబెట్టి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.