కోక్ లో వాడే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా..!

అస్పర్టేమ్.. ఇది ఒక కృత్రిమ చక్కెర చాలా నుంచి ఇది వాడటం సురక్షితమైనది కాదనే ఒక వాదన బలంగా నాటుకు పోయింది. ఈ చక్కెరను వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఉన్న వాదనపై తాజాగా డబ్ల్యూహెచ్ఓ ఒక పరిశోధన జరిపింది..

కోక్ లో వాడే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా..!


అస్పర్టేమ్.. ఇది ఒక కృత్రిమ చక్కెర చాలా నుంచి ఇది వాడటం సురక్షితమైనది కాదనే ఒక వాదన బలంగా నాటుకు పోయింది. ఈ చక్కెరను వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఉన్న వాదనపై తాజాగా డబ్ల్యూహెచ్ఓ ఒక పరిశోధన జరిపింది..
Expect Maaza to become billion-dollar brand by around 2024: Coca-Cola India  President, ET Retail
అస్పర్టేమ్.. చక్కెర ప్రమాదకరమని వార్తలు వచ్చిన దగ్గర నుంచి పలు రకాల వాదనలు వినిపిస్తూ వచ్చాయి. అందులో ముఖ్యంగా అందరినీ భయాందోళనకు గురి చేసే ప్రధాన కారణం ఈ చక్కెరను పలు రకాల పాపులర్ బ్రాండ్లలో ఉపయోగించటమే.. కోకా-కోలా జీరో, డైట్ వెర్షన్‌లలో, పెప్సీ విత్ మ్యాక్స్, 7 అప్ ఫ్రీ.. ఇలా టూత్‌పేస్ట్ నుంచి పెరుగు, దగ్గు మందు వరకు దాదాపు 6,000 ఉత్పత్తులలో ఈ చక్కెరను వాడుతూ ఉంటారు. అలాగే ఈ చక్కెర కొన్ని కారకాలతో కలిసినప్పుడు క్యాన్సర్ కు కారకం అవుతుందని తేలింది.
దాదాపు 20 ఏళ్ల నుంచి జరుగుతున్న పలు అధ్యయనాల్లో ఈ చక్కెర క్యాన్సర్ కారకమే అని నిరూపించబడింది. కాగా ఎలుకలపై చేపట్టిన పరిశోధనలలో సైతం ఈ విషయం నిరోపితం అయింది. కానీ మిగిలిన జీవులపై పరిశోధించినప్పుడు మాత్రం సరైన ఆధారాలు లభించలేదు.
A Look at Every Company That Coca-Cola Owns
అనంతరం లక్ష మందికి పైగా జరిగిన మరో పరిశోధనలో మనుషులపైనే ఈ అధ్యయనం కొనసాగించగా.. అస్పర్టేమ్‌ భారీగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు ఉంటుందని, అయితే, ఇక్కడ ఇతర ఆరోగ్య సమస్యలు, జీవన శైలి కూడా ప్రభావం చూపించొచ్చని దీనిలో వెల్లడైంది. కాగా ఏది ఏమైనా మితంగా ఉపయోగించినంతవరకు ఏ విషయం ప్రమాదకరం కాదని ఈ చక్కర ఉన్న పదార్థాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపింది ప్రపంచానికి సంస్థ. 
దీర్ఘకాలం వేధించే వ్యాధులతో బాధపడేవారు సైతం ఈ చక్కెర ఉన్న పదార్థాలను ఉపయోగించినప్పుడు పలు రకాల వ్యాధులు బారిన పడే అవకాశం ఉందని.. ఇలాంటివారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.