నల్ల ఉప్పు గురించి తెలుసా..? బోన్‌ స్రెంథ్‌కి నెంబర్‌ వన్‌

ఉప్పు వాడకం మంచిది కాదని వైద్యుల నుంచి ఆయుర్వేద నిపుణుల వరకూ అందరూ చెప్తున్నారు.. అవును అతిగా ఉప్పుని వాడితే.. చాలా సమస్యలు వస్తాయి.. కానీ ఉప్పులో చాలా రకాలు ఉంటాయి.. అందులో ఒకటి నల్లఉప్పు..

నల్ల ఉప్పు గురించి తెలుసా..? బోన్‌ స్రెంథ్‌కి నెంబర్‌ వన్‌


ఉప్పు వాడకం మంచిది కాదని వైద్యుల నుంచి ఆయుర్వేద నిపుణుల వరకూ అందరూ చెప్తున్నారు.. అవును అతిగా ఉప్పుని వాడితే.. చాలా సమస్యలు వస్తాయి.. కానీ ఉప్పులో చాలా రకాలు ఉంటాయి.. అందులో ఒకటి నల్లఉప్పు.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట.. మీరెప్పుడైనా ఈ నల్లఉప్పును చూశారా..? మనం వాడే తెల్ల ఉప్పు కంటే ఇది వందరెట్లు మంచిది..! ఈరోజు మనం ఈ నల్ల ఉప్పు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..!

Everything You Need to Know About Himalayan Black Salt - Clean Green Simple

నల్ల ఉప్పును వాడడం వల్ల శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నల్ల ఉప్పును కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

నల్ల ఉప్పులో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే ముఖ్యమైన మినరల్స్‌ ఇందులో అధికంగా ఉంటాయి. అందువల్ల తరచూ నల్ల ఉప్పును తింటే ఎముకలు దృఢంగా మారుతాయి.

షుగర్‌ పేషెంట్లకు నల్ల ఉప్పుతో చాలా మేలు జరుగుతుంది.. దీన్ని తీసుకోవడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షుగర్‌ కంట్రోల్లో ఉంటుంది.. 

చిన్నారులకు నల్ల ఉప్పు ఎంతగానో మేలు చేస్తుంది. వారిలో అజీర్ణం సమస్యను ఇది అద్భుతంగా తగ్గిస్తుంది. ప్లీహం ఏర్పడకుండా ఉంటుంది. రోజూ పిల్లలకు ఆహారంలో నల్ల ఉప్పును ఇవ్వండి.. దీంతో వారిలో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.

అజీర్ణం సమస్యతో బాధపడేవారు రోజూ నల్ల ఉప్పును తింటే ఫలితం కనిపిస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.


అయితే కిడ్నీ స్టోన్స్‌ ఉన్న వాళ్లు ఈ ఉప్పును వాడకూడదు.. ఇంకా.. సాధారణ ఉప్పు కన్నా నల్ల ఉప్పు ఎన్నో విధాలా మంచిది. అయితే సాధారణ ఉప్పుతో పోలిస్తే నల్ల ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని చాలా స్వల్ప మోతాదులోనే వాడుకోవాలి. కాబట్టి.. తక్కువ మోతాదులో వాడితే.. పైన చెప్పిన ప్రయోజనాలు అన్నీ పొందవచ్చు. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.