Sleep Tips : మనిషి సరిగ్గా నిద్రపోకపోతే ఎంత నష్టం జరుగుతుందో తెలుసా..?

Sleep Tips : నిద్ర స‌రిగ్గా పోవ‌డం అనేది ఈరోజుల్లో పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అయితే నిజానికి నిద్ర అనేది చాలా వ‌ర‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతుంది. మ‌నిషి నిద్రపోవడం చాలా అత్యవసరం. ఉదయం నుంచి రాత్రి వరకు

Sleep Tips : మనిషి సరిగ్గా నిద్రపోకపోతే ఎంత నష్టం జరుగుతుందో తెలుసా..?


Sleep Tips : మనిషికి నిద్ర చాలా అవసరం.. నిద్రలేకపోతే.. ఎన్ని సమస్యలు వస్తాయో మనకు బాగా తెలుసు.. ఎంత కడుపునిండా తిన్నా.. రెండు రోజులు వరుసగా నిద్రలేదంటే.. ఆగమే.. మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక ఒత్తిళ్ల మ‌ధ్య కాలం గ‌డుపుతుండ‌డంతో నిద్ర స‌రిగ్గా పోవ‌డం అనేది ఈరోజుల్లో పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అయితే నిజానికి నిద్ర అనేది చాలా వ‌ర‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతుంది. మ‌నిషి నిద్రపోవడం చాలా అత్యవసరం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనితో ప్ర‌తి ఒక్క‌రూ అలిసిపోతూనే ఉంటారు. అలా అలిసిపోయిన శరీరానికి రెస్ట్ ఇవ్వాలి. లేదంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మనిషికి సరిగ్గా నిద్ర లేకపోతే ఏం జరుగుతుందో చూద్దామా..!

నిద్ర స‌రిగ్గా పోక‌పోతే శ‌రీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే క్లోమ గ్రంథి ఉత్ప‌త్తి చేసే ఇన్సులిన్‌ను శ‌రీరం స‌రిగ్గా గ్ర‌హించ‌లేదు. ఫ‌లితంగా అధిక బ‌రువు పెరుగుతారు. డ‌యాబెటిస్ బారిన పడతారు.. 

నిత్యం స‌రిగ్గా పోకపోతే.. థైరాయిడ్ వ్యాధులు, గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

స‌రిగ్గా నిద్రించ‌ని వారిలో డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న స్థాయిలు అధికంగా ఉంటాయ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల ద్వారా కనుగొన్నారు..అలాగే నిద్ర స‌రిగ్గా పోక‌పోతే విసుగు, కోపం వంటివి వ‌స్తాయి.

శ‌రీర మెట‌బాలిజం నెమ్మ‌దిస్తుంది. ఫ‌లితంగా మ‌నం తినే ఆహారం ద్వారా మ‌న‌కు ల‌భించే క్యాల‌రీలు స‌రిగ్గా ఖర్చుకావు. దీంతో శ‌రీరంలో కొవ్వు చేరుతుంది. అధికంగా బ‌రువు పెరుగుతారు.

చ‌ర్మం పొడిబారుతుంది. జుట్టు రాలుతుంది. ఇత‌ర చ‌ర్మ‌, జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

నిత్యం టైముకు నిద్రించాలి. త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. రోజుకు క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు శ‌రీరానికి త‌గిన‌ట్టుగా నిద్రించాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిత్యం 8 గ్లాసుల వ‌ర‌కు నీటిని తాగితే మంచిది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.