లంగ్‌ క్యాన్సర్‌ ఆరంభంలో కనిపించే లక్షణాలు ఇవే.. గొంతు మారిన ప్రమాదమే..

ఆరోగ్యం దెబ్బతింటే ముందే దానికి సంబంధించి కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి.. వాటిని గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.. కానీ ముందు లక్షణాలను లైట్‌ తీసుకుంటాం.. ప్రాణాల మీదకు వచ్చాక పరుగులు తీస్తాం. క్యాన్సర్‌ ఏదైనా సరే.. సడన్‌గా రాదు..

లంగ్‌ క్యాన్సర్‌ ఆరంభంలో కనిపించే లక్షణాలు ఇవే.. గొంతు మారిన ప్రమాదమే..


ఆరోగ్యం దెబ్బతింటే ముందే దానికి సంబంధించి కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి.. వాటిని గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.. కానీ ముందు లక్షణాలను లైట్‌ తీసుకుంటాం.. ప్రాణాల మీదకు వచ్చాక పరుగులు తీస్తాం. క్యాన్సర్‌ ఏదైనా సరే.. సడన్‌గా రాదు.. కొన్ని నెలల ముందు నుంచే అది ఒక్కో లక్షణాన్ని మనకు చూపిస్తుంది.. మనం అవి ఇంకేంటోలే అనుకుని పెద్దగా పట్టించుకోం.. ఈ క్రమంలోనే లంగ్‌ క్యాన్సర్‌ ఆరంభంలో కొన్ని లక్షణాలు గురించి తెలుసుకుందాం.. ఎందుకంటే.. ఇవి చాలా కామన్‌గా ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ ఆరంభంలో అంత గుర్తు ప‌ట్ట‌ద‌గిన ల‌క్ష‌నాల‌ను ఏమీ చూపించ‌దు. వ్యాధి ముదిరే కొద్దీ ఒక్కొక్క‌టిగా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డుతుంటాయి. అయితే కొన్ని కేసుల్లో మాత్రం ల‌క్ష‌ణాలు ఆరంభంలోనే క‌నిపిస్తుంటాయి. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా లంగ్ క్యాన్సర్ వ‌చ్చింద‌నే విషయం మ‌న‌కు సుల‌భంగా తెలుస్తుంది.

క‌నీసం 3 వారాలుగా దగ్గు ఏమాత్రం త‌గ్గ‌కుండా నిరంత‌రాయంగా వ‌స్తూనే ఉంటే అది లంగ్ క్యాన్సర్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంద‌రికి ఆరంభంలో విప‌రీత‌మైన ద‌గ్గు వ‌స్తుంది. ఇది కొన్ని వారాల పాటు అలాగే ఉంటుంది. ద‌గ్గు ఎంత‌కూ త‌గ్గ‌కుండా అలా వ‌స్తూనే ఉంటే దాన్ని క్యాన్స‌ర్‌గా అనుమానించాలి. వైద్యులతో ప‌రీక్ష‌లు చేయించుకుంటే అది క్యాన్స‌ర్ అయిందీ, కానిదీ తెలుస్తుంది.
లంగ్ క్యాన్స‌ర్ ఆరంభంలో శ్వాస తీసుకోవ‌డం కూడా క‌ష్టంగా ఉంటుంది. కొంద‌రికి ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ఇలా జరుగుతుంది.. కానీ ఈ ల‌క్ష‌ణం ఎన్ని రోజులు అయినా త‌గ్గ‌కుండా అలాగే ఉంటే దాన్ని క్యాన్స‌ర్‌గానే అనుమానించాలి.
లంగ్ క్యాన్సర్ ఉన్న‌వారికి భుజాలు, ఛాతి, వెన్నెముక భాగాల్లో నొప్పి ఉంటుంది.. ఈ విధమైన నొప్పులు ఉంటే దాన్ని లంగ్ క్యాన్స‌ర్‌గా అనుమానించాలి.
లంగ్ క్యాన్స‌ర్ వ‌స్తే ఆరంభంలో బాధితుల గొంతు కూడా మారుతుంది. గొంతు నుంచి మాట వ‌చ్చేట‌ప్పుడు అంత‌కు ముందు క‌న్నా భిన్న‌మైన వాయిస్‌లో మాట వినిపిస్తుంది. వాయిస్ మారుతుంది. ఇలా జ‌రుగుతుంటే దాన్ని క్యాన్స‌ర్‌గా అనుమానించాలి.
క్యాన్స‌ర్ వ‌చ్చిన వారు స‌డెన్‌గా బ‌రువు త‌గ్గుతారు. క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల వ‌ల్ల అధిక బ‌రువు స‌డెన్‌గా త‌గ్గుతారు. ఈ విధంగా జ‌రిగితే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
ఈ లక్షణాలు ఏది ఎక్కువ రోజుల పాటు ఉన్నా.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.. దీంతో క్యాన్స‌ర్‌ను ఆరంభంలోనే గుర్తించి త‌గిన స‌మ‌యంలో చికిత్స అందించ‌వ‌చ్చు. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.