Risk of fat : మనిషి ప్రాణాలనే హరిస్తున్న కృత్రిమ కొవ్వు

Risk with Fat : మన శరీరంలో ఉండేది మంచి కొలెస్ట్రాలా లేక చెడు కొలెస్ట్రాలా? కొవ్వు అంటేనే చెడు కదా...మరీ మంచి, చెడు ఏంటీ అనుకుంటున్నారా? ప్రాణాంతకంగా మారిన కొవ్వు....మనిషి ప్రాణాలనే హరిస్తోంది.

Risk of fat : మనిషి ప్రాణాలనే హరిస్తున్న కృత్రిమ కొవ్వు
Health problems with fat


Health risk of over weight and obesity : మన శరీరంలో ఉండేది మంచి కొలెస్ట్రాలా లేక చెడ్డ కొలెస్ట్రాలా?

కొవ్వు అంటేనే చెడు కదా...మరీ మంచి, చెడు ఏంటీ అనుకుంటున్నారా?

ప్రాణాంతకంగా మారిన కొవ్వు....మనిషి ప్రాణాలనే హరిస్తోంది. ఊబకాయం, గుండెజబ్బులకు దారితీస్తోంది. అది తెలిసినా మనిషి దాని నుంచి బయటకురాలేకపోతున్నాడు. మనుషులు కొవ్వు పదార్థాలకు ఎంతలా అలవాటుపడిపోయారంటే....దాని నుంచి బయటకు రాలేనంత. రోజు తినే ఆహారంలోనూ కొవ్వు పదార్థాలు లేనిదే ముద్ద దిగదు. మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా నూనెలో వేయించిన చిప్స్ ఉండాల్సిందే.

రోజు తినే కొవ్వు వల్ల మనం ఒక రోజు ఆయుష్షు తగ్గించుకుంటున్నాం. ఇక పార్టీలు, పండుగలు అంటే ఒక నెల రోజుల ఆయుష్షు తగ్గినట్టే. సాధారణంగా శరీరంలో కొద్దిపాటి కొలస్ట్రాల్ ఉంటుంది. డ్రైఫ్రూట్స్ తినడం వల్ల వచ్చేది మంచి కొవ్వు, మితిమీరి తినడం, మాంసం, నూనె వంటలు, అతిగా పిండిపదార్థాలు, స్వీట్స్ తినడం వల్ల వచ్చి చేరేది చెడు కొలస్ట్రాల్. కడుపు కింద కొవ్వు పెరిగి.....మడతలు పడి సాగిపోయి అందవిహీనంగా మారుతుంది.

వాతావరణం చల్లగా ఉందంటే ఓ మిర్చిబజ్జీ, సమోసా ఒకటో రెండో తింటే పర్లేదు. కానీ మితిమీరి తింటే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే.

బయట అమ్మే చిరుతిళ్లు అస్సలు మంచివి కాదు. అక్కడ ఆహార భద్రతా ప్రమాణాలు పాటించరు. వీధి వ్యాపారులు ఎక్కువుగా వనస్పతి నూనె వాడతారు. కారణం బాగా చవక, మళ్లీ ఆహారానికి రుచి ఎక్కువ ఇస్తుంది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అది శరీరానికి చాలా హానికరం. గుండెపోటుకు దారితీస్తుంది.

కొవ్వు సమస్య పురుషులకే కాదు...మహిళలనూ బాధిస్తోంది. అతిగా కూర్చోవడం వల్ల పొట్ట, నడుము, తొడలు, పిరుదుల్లో కొవ్వు పేరుకుపోతోంది. దీనివల్ల బద్ధకం, అలసట వస్తుంది. అతి కొవ్వు వల్ల నెలసరి సమస్యలకు కూడా దారి తీయోచ్చు.

చివరకు మనం లావు అయిపోతున్నామని అందరూ ఎగతాళి చేయడం వల్ల ఆత్మన్యూనత భావానికి వచ్చేస్తారు.

కొవ్వు వల్ల కలిగే నష్టాలు-

ఊబకాయం, మధుమేహం, బద్ధకం, అలసటగా అనిపించడం, అధికబరువు

మితిమీరి తినేస్తుండటం, గుండెజబ్బులు రావడం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.