ఇసినోఫిలియా తగ్గడం లేదా? ఈ పద్ధతి ఫాలో అయిపోండి........

ఇసినోఫిలియా అంటే తెలియంది కాదు. పుట్టే పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఈ సమస్య ఉంటుంది. ఇది వారసత్వంగా వచ్చే సమస్య కూడానూ. దీని కోసం పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఏ చిన్న ఇబ్బంది కలిగినా దీని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇసినోఫిలియా అనేది వైరస్‌. దీనివల్ల ఆస్తమా వస్తుంది.

ఇసినోఫిలియా తగ్గడం లేదా? ఈ పద్ధతి ఫాలో అయిపోండి........


ఇసినోఫిలియా అంటే తెలియంది కాదు. పుట్టే పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఈ సమస్య ఉంటుంది. ఇది వారసత్వంగా వచ్చే సమస్య కూడానూ. దీని కోసం పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఏ చిన్న ఇబ్బంది కలిగినా దీని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇసినోఫిలియా అనేది వైరస్‌. దీనివల్ల ఆస్తమా వస్తుంది. కఫం విపరీతంగా ఉంటుంది. పిల్లి కూతలు వంటి ఉంటాయి.

Eosinophilic Disorders | Eosinophilia | MedlinePlus

ఈ రుగ్మతను చిన్నప్పుడే గుర్తించగలగాలి. చాలా మంది చిన్నపిల్లలకు చిన్నవయసులో ఉన్నప్పుడు గాడిదపాలు పడతారు. ఈ ఇసినోఫిలియా తగ్గడానికి. అది కూడా ఒక విధంగా మంచి ఔషధమే. స్త్రీ స్తన్యం లానే గాడిద పాలు ఉంటాయి.
ఆవుపాలతో సమానమైన విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. దగ్గు, జలుబు, ఆస్తమా ఉన్నవాళ్లకు నయం చేసేందుకు వీటిని పడతారు.

అయితే ఇంకో విషయం ఈ ఆస్తమా విజృంభిస్తే మాత్రం రక్తపు వాంతులు, ఆయాసం, ఉబ్బరం, తీవ్ర కఫం, దగ్గు వంటిని బీభత్సం పెరిగిపోతాయి. దానివల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆస్తమా కోసం చేప మందు కూడా వాడుతుంటారు. ఎన్ని మందులు వాడినా మనం చేసే చిన్నచిన్న పనుల వల్ల ఆ సమస్య మాయం కాదు. కాబట్టి దానిపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. తినేతిండి విషయంలో హద్దులు పెట్టుకోవాలి.

ముఖ్యంగా పంచదార, బెల్లం, తీపి పదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌కు చాలా దూరంగా ఉండాలి. ఈ తీపి అనేది శరీరంలో ఇసినోఫిలియా వైరస్‌ పెంచడానికి దోహదం చేస్తాయి. అలాంటప్పుడు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు.

అందుకే ఏమైనా తీపి పదార్థాలు తినాలనుకున్నప్పుడు...ఖర్జూరం, ఎండూ ఖర్జూరం వాడుకోవాలి. పచ్చి ఖర్జూరాన్ని పేస్ట్‌లా చేసుకుని మిక్సీలో పెట్టుకుని అవసరమైన స్వీట్స్‌లో వాడుకోవాలి. లడ్డూలు, రవ్వ లడ్డూలు వంటి వాటిలో ఎండూ ఖర్జూరం వాడుకుంటే చాలా ఉత్తమం. అయితే వీటితో పాటు తెనే వాడుకుంటే ఇంకా మంచిది. బయటదొరికే తెనేల్లో షుగర్‌ కంటెంట్‌ ఉంటుంది. కాబట్టి మంచి తెనేను తీసుకోవాలి. షుగర్‌, బెల్లం వాడటం మానేస్తే....చాలావరకు ఇసినోఫిలియా తగ్గిపోతుంది. పిల్లికూతలు కూడా ఆగిపోతాయి.

అయితే ఇసినోఫిలియా ఉన్నవాళ్లు తెనే ఉపవాసం చేయాలి. అదెలా అంటే గోరువెచ్చటి నీళ్లలో తెనే నిమ్మరసం కలుపుకుని రోజంతా తాగుతూ ఉండాలి. అలా రోజుకు 6, 7 సార్లు తీసుకోవాలి. దీంతో పాటే నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా ఆస్తమా ఉండేవాళ్లు ఏ కాలమైనా గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి. వేడి నీళ్లే స్నానం చేయాలి. చల్లని నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. లేకపోతే ఇసినోఫిలియా ఎక్కువఅయిపోతుంది.

ఒక చిన్న వైరస్‌ మన భారీ దేహాన్ని నాశనం చేస్తుందంటే మన రోగనిరోధక శక్తి ఎంత  బలహీనంగా ఉందో ఆలోచించుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.