Malabar Spinach : బచ్చలికూర అని తేలిగ్గా తీసేస్తున్నారా..? ఈ లాభాలు తెలిస్తే బంగారం అంటారు..!!

ఆకుకూరల్లో Malabar Spinach ఇంకా మంచిది. ఇది అయితే ఎలాంటి ప్రదేశాల్లో అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఊర్లల్లో చాలామంది ఇంట్లో spinach తీగ ఉంటుంది. పోషకాల నిలయం బచ్చలికూర. అనేక ఔష‌ధ గుణాలు ఇందులో ఉంటాయి.

Malabar Spinach : బచ్చలికూర అని తేలిగ్గా తీసేస్తున్నారా..? ఈ లాభాలు తెలిస్తే బంగారం అంటారు..!!
Benefits of Malabar spinach


ఆకుకూరలన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి.. ఆకుకూరల్లో  Malabar Spinach ఇంకా మంచిది. ఇది అయితే ఎలాంటి ప్రదేశాల్లో అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఊర్లల్లో చాలామంది ఇంట్లో బచ్చలికూర తీగ ఉంటుంది. పోషకాల నిలయం బచ్చలికూర. అనేక ఔష‌ధ గుణాలు ఇందులో ఉంటాయి. బ‌చ్చ‌లికూర‌ను నేరుగా కూర‌గా వండుకుని తిన‌వ‌చ్చు. లేదా ప‌ప్పులా చేసి తిన‌వ‌చ్చు. దీని ఆకుల ర‌సాన్ని ప‌ర‌గ‌డుపున 30 ఎంఎల్ మోతాదులోనూ తాగ‌వ‌చ్చు. బ‌చ్చ‌లికూర వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఒకసారి చూద్దాం.!

బచ్చలికూరతో బోలెడు లాభాలు..

  • బ‌చ్చ‌లికూర‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. 
  • బ‌చ్చ‌లికూర‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది. 
  • ఈ కూర‌లో ఉండే విట‌మిన్ కె ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది.

  • రోజూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంద‌ని భావించే వారు బ‌చ్చ‌లికూర‌ను తింటే శ‌క్తి ల‌భిస్తుంది.
  • హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు బ‌చ్చ‌లికూర‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. 
  • గ‌ర్భిణులు దీన్ని తింటే ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది.
  • బ‌చ్చ‌లికూర‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు ప‌డుతుంది. 
  • పైల్స్ స‌మ‌స్య ఉన్న‌వారు బ‌చ్చ‌లికూర‌ను తింటుంటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
  • బ‌చ్చలికూర‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే నాడీ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
  • అధిక బ‌రువు, కొలెస్ట్రాల్, మ‌ధుమేహం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ ప‌ర‌గ‌డుపున బ‌చ్చలి ఆకుల ర‌సం తాగితే ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
  • బ‌చ్చ‌లికూర‌లో విట‌మిన్లు ఏ, సీ, ఇ, బీ విట‌మిన్లు, ఐర‌న్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, అయోడిన్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల ఈ కూర‌ను తింటే పోష‌ణ ల‌భిస్తుంది. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.
            బ‌చ్చ‌లికూర‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని తింటే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ కూర‌లో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చ‌ర్మం, వెంట్రుక‌ల‌ను సంర‌క్షిస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.