పొగ తాగడం మానాలనుకుంటే ఇవి చేయండి

యువత అంటేనే అన్ని విషయాల్లో కాస్త దూకుడుగా ఉంటారు. ప్రతిదానికి ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పాల్గొంటారు. యూత్‌గా ఉన్నప్పుడే....అది చేయాలి, ఇది చేయాలి అని ఉబలాటంగా ఉంటుంది. మంచిదారిలో వెళ్లాలన్నా, చెడు దారిలో వెళ్లాలన్నా యువ దశే మొదటి మెట్టు. వ్యసనాలకు అలవాటు పడటం కూడా ఈ దశలోనే జరుగుతుంది.  

పొగ తాగడం మానాలనుకుంటే ఇవి చేయండి


యువత అంటేనే అన్ని విషయాల్లో కాస్త దూకుడుగా ఉంటారు. ప్రతిదానికి ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పాల్గొంటారు. యూత్‌గా ఉన్నప్పుడే....అది చేయాలి, ఇది చేయాలి అని ఉబలాటంగా ఉంటుంది. మంచిదారిలో వెళ్లాలన్నా, చెడు దారిలో వెళ్లాలన్నా యువ దశే మొదటి మెట్టు. వ్యసనాలకు అలవాటు పడటం కూడా ఈ దశలోనే జరుగుతుంది.  

Smoking - Wikipedia



పొగ తాగటం కూడా..... ముందు ఆసక్తితోనే ఆరంభమవుతుంది. చివరికి వ్యసనం ఊబిలోకి నెట్టేస్తుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు..ఏవైనా గానీ తాగినప్పటి నుంచి అవయవాలపై ప్రభావం పడుతుంది. దానివల్ల తాగేవాళ్లకే కాదు.....ఆ పొగ పీల్చే వాళ్లపైన కూడా ప్రభావం ఉంటుంది.
 
పొగాకు వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బుల లాంటి దీర్ఘకాల వ్యాధులతో క్యాన్సర్ల వరకూ రకరకాల సమస్యలకు దారితీస్తాయి. మనదేశంలో జబ్బులకు, మరణాలకు కారణమవుతున్న ప్రధాన అంశాల్లో పొగాకు అలవాటు ఒకటి. ఒక్క సిగరెట్లు, చుట్టలు, బీడీలు, హుక్కా రూపంలోనే కాదు.. గుట్కా, ఖైనీ, జర్దా ద్వారానూ పొగాకు వాడేవారు ఎందరో. కాబట్టి పొగాకుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

గుండెజబ్బులకు దారితీసే ప్రధాన ముప్పు కారకాల్లో పొగ తాగటం ఒకటి. దానివల్ల చిన్న వయసులో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. పొగ తాగేవారికి రక్తం గడ్డలు ఏర్పడే ముప్పూ ఎక్కువే. రక్తనాళాలు దెబ్బతినటం ఒక్క గుండెలోనే కాదు. కాళ్లకు వెళ్లే రక్తనాళాల్లో పూడికలతో పుండ్లు త్వరగా మానకపోవచ్చు. పొగ మూలంగా కొన్నిసార్లు రక్తనాళాల గోడలు పలుచబడి అక్కడ ఉబ్బొచ్చు.

పొగాకు వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీయోచ్చు. ఇది వీరిలో అంగం క్యాన్సర్‌కు దారితీయొచ్చు. ఇది నెలసరి క్రమాన్ని దెబ్బతీస్తుంది. పొగతాగే మగవారి వీర్యంలోకీ నికొటిన్‌ చేరుకుంటుంది. దీని మూలంగా శుక్రకణాలు దెబ్బతిని, సంతానానికి ఇబ్బందే. కృత్రిమ గర్భధారణ చికిత్సల సామర్థ్యం మందగిస్తుంది. ఇంట్లో ఎవరు పొగతాగినా దాని ప్రభావం పిల్లలపైనా పడుతుంది.

సిగరెట్లు, చుట్టల బూడిద ఇంట్లో నేల మీద పడి, అది గాలికి పైకి లేచి అలర్జీ, ఆస్థమా ప్రేరేపితం కావొచ్చు. పొగ ఎతాగటం వల్ల ఆకలి మందగిస్తుంది. క్షయ ముప్పు పెరుగుతుంది. పెదవి, నోరు, నాలుక, అంగిలి, అన్నవాహిక, జీర్ణాశయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌, కాలేయం, మూత్రాశయం, కిడ్నీ క్యాన్సర్ల వంటివెన్నో తలెత్తుతాయి. ఎముక మజ్జలోనూ క్యాన్సర్లు రావొచ్చు. పొగాకుతో సంభవించే క్యాన్సర్లలో ఎక్కువగా కనిపించేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.