నోటి దుర్వాసనకు ఆయిల్ పుల్లింగ్ తో చెక్.. 

మన నోటిలో దాదాపు 600 రకాల సూక్ష్మజీవులు ఉంటాయని తెలుస్తోంది. దీని వలన ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరమయ్యే ఎంజైములు ఉంటాయన్న మాట నిజమే. అయినప్పటికీ పలు రకాల నోటి సమస్యలు సైతం వస్తూ ఉంటాయి.

నోటి దుర్వాసనకు ఆయిల్ పుల్లింగ్ తో చెక్.. 
stop mouth bad smell with oil pulling


ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య నోటి దుర్వాసన.. దీని వలన ఎదుటి మనిషితో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది.. అలాగే తమపై తాము విశ్వాసాన్ని సైతం కోల్పోతూ ఉంటారు. నలుగురిలో ధైర్యంగా మాట్లాడలేక పోతారు. చాలా చిన్న సమస్యగా కనిపించే ఈ సమస్య మానసికంగా ఎంతో ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అంటే.. 

సాధారణంగా నోటికి సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో నోటి దుర్వాసన కూడా ఒకటి. మన నోటిలో దాదాపు 600 రకాల సూక్ష్మజీవులు ఉంటాయని తెలుస్తోంది. దీని వలన ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరమయ్యే ఎంజైములు ఉంటాయన్న మాట నిజమే. అయినప్పటికీ పలు రకాల నోటి సమస్యలు సైతం వస్తూ ఉంటాయి. అలాగే రోజు తీసుకునే ఆహారం పళ్ళ సందుల్లో ఇరుక్కుపోవడం వల్ల కూడా నోటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకే తిన్న వెంటనే నోటిని పూర్తిగా శుభ్రం చేసుకోవడం ఎంతైనా అవసరం. ప్రతి రోజు రెండు పూటలా బ్రష్ చేయాలి అలాగే సంబంధించి చిగుళ్ళకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా వైద్యుల్ని సంప్రదించాలి. అలాగే ఈ సమస్యలేవీ రాకుండా నోటి దుర్వాసనకు ఆయిల్ పుల్లింగ్ తో చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు.. 

ఆయుర్వేదం సైతం ఆయిల్ పుల్లింగ్ తో నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా నోటికి సంబంధించిన ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చని కూడా తెలుస్తుంది అయితే ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి అంటే.. ఉదయం లేవగానే బ్రష్ చేయాలి ఆ తర్వాత సుద్ధమైన కొబ్బరినూనెను కానీ.. నువ్వుల నూనె కానీ ఉపయోగించి ఆయిల్ పుల్లింగ్ చేయాలి. ముఖ్యంగా నువ్వుల నూనె చాలా మంచిది. రెండు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నోట్లో వేసుకొని దాదాపు 5 నుంచి పది నిమిషాల పాటు పూర్తిగా పక్కలించాలి.

అయితే ఇది పొట్టలోకి పోకుండా మాత్రం జాగ్రత్త పడాలి. ఆ తర్వాత నోటిని శుభ్రంగా గోరువెచ్చని నీటితో మరొకసారి పుక్కలించాలి.  ఇలా కనీసం వారానికి ఒకసారి చేయడం వల్ల నోటి లోపల ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కూడా వదిలి పోతాయి.. ఇలా ఆయిల్ పుల్లింగ్ చేసిన వెంటనే ఏ ఆహారాన్ని తినకూడదు. దాదాపు పావుగంట నుంచి అరగంట సమయం ఇవ్వాలి. అలాగే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.