Anemia : ఒక్కసారిగా మొహం తెల్లగా మారి చెక్కిళ్ళు మెరిసిపోతున్నాయా.. అందం కాదది అనారోగ్యం.. ఈ సమయంలో శరీరంలో జరిగేది ఇదే..

Anemia, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఇలా ఎలా జరుగుతుంది అందంగా మారిపోతున్నామని అపోహలో పడొద్దు. అది అందం కాదు అనారోగ్యం. శరీరంలో జరిగే కొన్ని మార్పులతో ఇలా జరుగుతుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్య వేధిస్తే ఇవే లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి.

Anemia : ఒక్కసారిగా మొహం తెల్లగా మారి చెక్కిళ్ళు మెరిసిపోతున్నాయా.. అందం కాదది అనారోగ్యం.. ఈ సమయంలో శరీరంలో జరిగేది ఇదే..
Reasons for sudden face turns white and shining cheeks


Anemia : అప్పటివరకు రంగు తక్కువగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా మంచి రంగులోకి వచ్చేస్తూ ఉంటారు. తెల్లగా మెరిసిపోతూ బుగ్గలు మెరిసిపోతాయి. చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఇలా ఎలా జరుగుతుంది అందంగా మారిపోతున్నామని అపోహలో పడొద్దు. అది అందం కాదు అనారోగ్యం. శరీరంలో జరిగే కొన్ని మార్పులతో ఇలా జరుగుతుంది. ముఖ్యంగా Anemia సమస్య వేధిస్తే ఇవే లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి. పలు వ్యాధులకు మూలమైన రక్తహీనతను  తగ్గించుకోకపోతే మాత్రం పలు సమస్యలు తప్పవు..

రక్తహీనత వస్తే ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనిషి శరీరం నిగామింపును సంతరించుకొని తెల్లగా మారిపోతుంది. ఇలా జరుగుతూ ఉంటే శరీరంలో రక్తం స్థాయిలు పడిపోతున్నాయని గుర్తించుకోవాలి. కొన్నిసార్లు చర్మం పాలిపోతూ కనిపిస్తుంది. మహాభారతంలో పాండురాజు ఇదే సమస్యతో బాధపడతాడు. దీన్నే మనం ఎప్పటికీ పాండు వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటాము..

శరీరంలో ఈ సమయంలో ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. తెల్ల రక్త కణాల స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. రక్తం పరిమాణం పడిపోతుంది. దీనికి పలు కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్న వయసులో తెలియక కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఎనీమియా వ్యాధి వస్తుంది. చిన్నతనంలో పొడి బియ్యం తినటం, చాక్పీసులు, సున్నం తినడం వల్ల రక్తం పాలిపోతుంది. ఉప్పు, పులుపు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల సరిపడని ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. కొందరికి నువ్వుల నూనె సరిపడదు. తీసుకున్న కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇలా కాకుండా అధిక మోతాదులో తీసుకుంటే అజీర్ణం సమస్య మొదలయ్యి చివరికి ఆకలి కూడా వెయ్యదు.

ఎనీమియాను ఎలా గుర్తించాలంటే.

చర్మం తెల్లగా మారిపోవడం, మొఖం ఉబ్బినట్టు కనిపించటం, కాళ్లు చేతులు లాగుతూ ఉండటం, అతిగా నీరసంగా అనిపించి ఎప్పుడు పడుకోవాలి అనిపించడం, గుండె దడ దడగా ఉండటం, ఆకలి వేయకపోవడం, కొన్నిసార్లు కళ్ల కింద వాపు కనిపించటం, పాదాల్లో పగుళ్లు ఏర్పడి నిర్జీవంగా మారటం, కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో కూడా కష్టం అవడం

ఎనిమియా సమస్య ఉన్నవారు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. గోంగూర, తోటకూర, పాలకూర వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్ని కాలాల్లో దొరికే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నువ్వులు, బెల్లం, వేరుశెనగ తో చేసిన ఆహార పదార్థాలు రక్తహీనతను దూరం చేస్తాయి. దానిమ్మ పండు శరీరంలో రక్తం స్థాయిని పెంచుతుంది. క్యారెట్, బీట్రూట్, నల్ల ద్రాక్ష రక్తాన్ని శుద్ధి చేసి రక్తం స్థాయిలని పెంచుతాయి. ఎనీమియా ఉన్నవారు శెనగపిండితో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు చక్కని ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్రపోతే ఎలాంటి సమస్యలు దరి చేరవు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.