Dry ginger : కడుపు ఉబ్బరంగా అనిపించి ఆకలి వేయటం లేదా.. పిల్లల నుంచి పెద్దల వరకు ఉపయోగపడే ఇంట్లో చేసుకునే శొంఠి వైద్యం..

జీర్ణరసం సరిగా విడుదల అవ్వక జటరాగ్ని చల్లబడిపోయి తీసుకునే ఆహారం జీర్ణం అవ్వదు. దీని వలన క‌డుపులో ఎన్నో రకాల వాయువులు విడుదలై మనిషిని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అందుకే తీసుకునే ఆహారంలో కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.

Dry ginger : కడుపు ఉబ్బరంగా అనిపించి ఆకలి వేయటం లేదా.. పిల్లల నుంచి పెద్దల వరకు ఉపయోగపడే ఇంట్లో చేసుకునే శొంఠి వైద్యం..
Dry ginger for bloated stomach and Loss of Appetite


Dry ginger (sonti) : తీసుకునే ఆహారం సకల చర్యలకు కారణం. ముఖ్యంగా రోజు మనం చేసే పనులు ఎంతో చలాకీగా చేసుకోవాలి అన్నా ఏ నీరసం ఆవహించకుండా ప్రశాంతంగా ఉండాలి అన్నా తగిన పోషకాహారం కచ్చితంగా తీసుకోవాలి. అయితే పోషకాహారం మాట పక్కన ఉంచితే అసలు ఆహారం తినటానికి కొందరికి ఆకలే వేయదు. కడుపు ఉబ్బరించి గాలి చేరిపోయినట్టు ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. తిన్న ఆహారం సైతం జీర్ణం అవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి వారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

తిన్న వెంటనే ఆహారం జీర్ణం అయిపోవడం ఎంతో అదృష్టమని చెప్పాలి.. కానీ ఈ అదృష్టం అందరికీ వరించేది కాదు. కంటి ముందు చూడటానికి ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ తినలేము. కారణం జీర్ణాశయంలో ఏర్పడే ఇబ్బందులే. జీర్ణరసం సరిగా విడుదల అవ్వక జటరాగ్ని చల్లబడిపోయి తీసుకునే ఆహారం జీర్ణం అవ్వదు. దీని వలన క‌డుపులో ఎన్నో రకాల వాయువులు విడుదలై మనిషిని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అందుకే తీసుకునే ఆహారంలో కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.

అజీర్ణం ఎందుకు వస్తుందంటే..

భోజనానికి మధ్య ఖచ్చితంగా 3 గంటల విరామం ఇవ్వాలి. ఇలా కాకుండా ఆహారం తిన్న వెంటనే మళ్ళీ తినటం వల్ల సరిగ్గా జీర్ణం అవ్వదు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు పూర్తిగా చూడకనే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కడపలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ఒక సమయం లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే పడుకోవడం, ఆకలి లేనప్పుడు కూడా బలవంతంగా ఆహారం తీసుకోవడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినటం వంటివి అసలు మంచిది కాదు. కారం పలుపు పదార్థాలు అధికంగా తినటం వల్ల అజీర్ణం సమస్య వేధిస్తుంది. అలాగే తినేసి కూర్చోవడం, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం వంటివి కూడా కారణాలు. వీటన్నిటి వల్ల జీర్ణశక్తి మందగించి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. 

ఎలా తగ్గించాలంటే..

అజీర్తి సమస్యను తగ్గించడంలో ముందుంటాయి ధనియాలు, సొంటి వీటిని తరచూ తీసుకోవాలి.

సొంటి ధనియాలు సమానంగా తీసుకొని నీటిలో వేసి మరిగించాలి. రోజు ఈ నీటిని అర గ్లాసు తీసుకోవడం వల్ల అజీర్ణం సమస్య దరిచేరదు.

బెల్లం తో సొంటిని కలిపి సమంగా నూరి చిన్న ఉసిరికాయ అంత చేసి నీటితో తీసుకోవడం వల్ల కడుపులో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

కరక్కాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నల్ల ద్రాక్ష కరక్కాయ కలిపి తీసుకుంటే అజీర్ణం సమస్య తగ్గుతుంది.

వాము, సొంటి, జీలకర్ర వంటివి వేయించి పొడిచేసి అన్నం తినటానికి ముందు చిన్న క్లాసులో నీరు తీసుకొని ఒక చెంచా లో సగం ఈ పొడిని కలిపి తాగడం వల్ల అజీర్ణం సమస్య దరిచేరదు సరి కదా ఆకలి మంచిగా వేస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.