కాళ్ళలో తిమ్మిర్లు, మంటలా? ... అయితే ఆ భయంకరమైన రోగం కావచ్చు.. జర జాగ్రత్త! 

డయాబెటిస్..  శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపించే అతిపెద్ద దీర్ఘకాలిక రోగం.  దీన్ని ఎప్పుడూ కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే శరీరంలోని అనేక అవయవాలు దెబ్బ తింటాయి. ముఖ్యంగా డయాబెటిస్ కంట్రోల్ లేనివారికి డయాబెటిస్ న్యూరోపతి వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది.  అసలీ డయాబెటిస్

కాళ్ళలో తిమ్మిర్లు, మంటలా? ... అయితే ఆ భయంకరమైన రోగం కావచ్చు.. జర జాగ్రత్త! 


డయాబెటిస్..  శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపించే అతిపెద్ద దీర్ఘకాలిక రోగం.  దీన్ని ఎప్పుడూ కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే శరీరంలోని అనేక అవయవాలు దెబ్బ తింటాయి. ముఖ్యంగా డయాబెటిస్ కంట్రోల్ లేనివారికి డయాబెటిస్ న్యూరోపతి వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది.  అసలీ డయాబెటిస్ న్యూరోపతి లక్షణాలు ఏమిటి? దీనిని ఎలా గుర్తించాలి అనేది  తెలుసుకుందాం.
సాధారణంగా వేధించే డయాబెటిస్కి భిన్నంగా ఉంటుంది ఈ డయాబెటిస్ న్యూరోపతి.. దీని వల్ల కాళ్లు, చేతుల నరాలు దెబ్బతింటాయి. పాదాలలో చాలా అసౌకర్యంతో పాటు  జలదరింపుగానూ ఉంటుంది. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం జరుగుతుంటుంది. నడిచే సమయంలో కాస్త తడబడటం,  ఒక్కొక్కసారి తూలుతున్నట్లుగా  అనిపించడం జరుగుతుంది. అలానే ఈ డయాబెటిక్ న్యూరోపతి వల్ల  గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ తో పాటు జననేంద్రియాలపైన కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది.
ఇంకా ఈ డయాబెటిక్ న్యూరోపతి వల్ల మహిళలలో శృంగార కాంక్ష తగ్గుతుంది. జననేంద్రియాలలో అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. యోని పొడిగా ఉండి  సంభోగం ఇబ్బందికరంగా ఉంటుంది. మూత్రాశయ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో రకాల సమస్యలు వేధిస్తాయి. 
ముఖ్యంగా ఈ వ్యాధి ఉన్నవారికి నిద్ర కరువైపోతుంది. రాత్రి వేళ పాదాలలో విపరీతమైన మంట ఉంటుంది.  పాదాలు మంటలు, నొప్పులతో సరిగ్గా నిద్ర పట్టదు.  ఏది తిన్న వికారంగా వాంతి చేసుకోవాలని అనిపిస్తుంది.  కొందరికి విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. 
ఈ వ్యాధి ఉన్నవారు ఆహారాన్ని సరిగ్గా తీసుకోలేరు అంతేకాకుండా తిన్న ఆహారం జీర్ణం ఒక ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు డయాబెటిక్ న్యూరోపతి వల్ల మలబద్ధకం కూడా వస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఈ డయాబెటిక్ న్యూరోపతి వుంటే విపరీతంగా చెమటలు పట్టడం, గుండెదడగా అనిపించడం, హృదయ స్పందన పెరిగినట్టుగా అనిపించడం జరుగుతుంది. కండరాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించటం,  కళ్లు తిరిగినట్లుగా అనిపించడం జరుగుతుంది. డయాబెటిస్ ఉండి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎప్పటికప్పుడు వైద్యుల్ని సంప్రదించటం తగిన పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.